• January 28, 2022

సాయి పల్లవికి అప్పుడే చెప్పా.. ‘ఢీ’ నాటి సంగతులపై బ‌ృందా మాస్టర్

సాయి పల్లవికి అప్పుడే చెప్పా.. ‘ఢీ’ నాటి సంగతులపై బ‌ృందా మాస్టర్

    Brinda Master Sai Pallavi సాయి పల్లవి ఢీ షోలో పర్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలా కంటెస్టెంట్‌గా వచ్చిన సాయి పల్లవి ఇప్పుడు ఇలా సౌత్ స్టార్ హీరోయిన్‌గా మారుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అది కూడా సాయి పల్లవికి తెలుగులో మొదటగా అవకాశాలు రాలేదు. ఎక్కడో మళయాలంలో తనది తాను నిరూపించుకుంది. అలా ప్రేమమ్ సినిమాతో సాయి పల్లవి అందరినీ మెప్పించింది.

    అక్కడి నుంచి తెలుగు, తమిళం ఇలా సౌత్ మొత్తం పాగా వేసింది. సాయి పల్లవి డ్యాన్సులకు రెండు తెలుగు రాష్ట్రాలు ఫిదా అయ్యాయి. ఆమె డ్యాన్స్ వేస్తుంటే సిల్వర్ స్క్రీన్ మొత్తం షేక్ అవ్వాల్సిందే. ఇక ఇప్పుడు సాయి పల్లవి సౌత్ నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పడానికి ఏ మాత్రం సందేహ పడాల్సిన అవసరం లేనంతగా దూసుకుపోతోంది.

    గత ఏడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. అయితే సాయి పల్లవి ఈ రేంజ్‌లో సక్సెస్ అవుతుందని బృందా మాస్టర్ ఎప్పుడో చెప్పిందట. ఢీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న సమయంలోనే బృందా మాస్టర్ చెప్పేసింది. నువ్ ఏదో ఒక రోజు పెద్ద హీరోయిన్ అవుతావ్.. అప్పుడు నేను నీకు కొరియోగ్రఫీ చేస్తాను అని సాయి పల్లవితో బృందా మాస్టర్ అనేసిందట.

    అలా చెప్పినట్టుగానే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిందట, ఆమెకు కొరియోగ్రఫీ చేసిందట. తెలుగు, తమిళ సినిమాలకు సాయి పల్లవికి కొరియోగ్రఫీ చేశానని చెప్పింది. అప్పుడు సాయి పల్లవిని కంటెస్టెంట్‌గా చూసినా కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా చూస్తున్నాను అని బృందా మాస్టర్ చెప్పేసింది. తాను చెప్పినందుకు సాయి పల్లవికి ఈ స్టేటస్ రాలేదని, ఆమె కష్టపడింది కాబట్టే వచ్చిందని తెలిపింది.

    Leave a Reply