• August 4, 2025

Gurram Paapi Reddy Teaser : నన్ను కొత్తగా చూపించాడు.. మురళీ మనోహర్‌పై బ్రహ్మానందం ప్రశంసలు

Gurram Paapi Reddy Teaser : నన్ను కొత్తగా చూపించాడు.. మురళీ మనోహర్‌పై బ్రహ్మానందం ప్రశంసలు

    Gurram Paapi Reddy Teaser బ్రహ్మానందం ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర లేదు. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే చాలు, సినిమాలో ఉంటే చాలు.. ఆ మూవీ హిట్ అవుతుందని ఆడియెన్స్ నమ్ముతుంటారు. గత కొన్నేళ్లుగా బ్రహ్మానందం ఆచితూచి సెలెక్టెడ్‌గా సినిమాల్ని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో గుర్రం పాపిరెడ్డి అనే సినిమాలో బ్రహ్మానందం ఓ స్పెషల్ పాత్రను పోషించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ చిత్ర దర్శకుడు మురళీ మనోహర్‌ను ప్రశంసించారు.

    బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘గుర్రం పాపిరెడ్డి చిత్రంలో నేను ముఖ్య మైన పాత్రను పోషించాను. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. దర్శకుడు మురళీ నన్ను చాలా కొత్తగా చూపించారు. ఇందులో నన్ను జడ్జ్‌గా చూపెట్టారు. టెక్నాలజీ వాడుకుని నన్ను చాలా కొత్తగా చూపించారు. ఇంత వరకు ఎవ్వరూ నాతో చేయించనట్టుగా చేయించాడు.. కెమెరామెన్ కూడా నన్ను కొత్తరకంంగా చూపించే ప్రయత్నం చేశారు. మనిషి కాస్త సాఫ్ట్‌గా ఉంటాడు కానీ.. ’ అంటూ దర్శకుడిని పొగిడేశారు.