• December 1, 2021

బ్రహ్మానందం వల్లే ఆలీ హీరో అయ్యాడట!.. అసలు కథ ఇదే

బ్రహ్మానందం వల్లే ఆలీ హీరో అయ్యాడట!.. అసలు కథ ఇదే

    కమెడియన్‌గా ఉన్న ఆలీ యమలీల సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. యమలీల కథను ముందుగా మహేష్ బాబు కోసం వినిపించారట. ఇంకా మహేష్ బాబు చిన్నపిల్లాడే అని సూపర్ స్టార్ కృష్ణ వద్దన్నారట. అలా చివరకు ఆ అవకాశం మాత్రం ఆలీకి దక్కింది. కమెడియన్ ఆలీ పక్కన నేను నటించడం ఏంటి? అని సౌందర్య హీరోయిన్‌గా చేయనని చెప్పేసిందట.

    అయితే అసలు ఆలీ వద్దకు కథ వెళ్లడం, హీరోగా మారడం వెనక పెద్ద కథే ఉందట. దానికి మూలం మాత్రం బ్రహ్మానందం అని తాజాగా బయటకు వచ్చింది. ఆలీతో సరదాగా షోలో బ్రహ్మానందం గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి బ్రహ్మానందం ఎపిసోడ్ కావాలని నెటిజన్లు కోరారు. మొత్తానికి ఆ ఎపిసోడ్ రానే వచ్చింది. ఇక రెండో భాగం కూడా రెడీగానే ఉంది.

    అయితే బ్రహ్మానందం, ఆలీ ముచ్చట్లలో భాగంగా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. మాయలోడు సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా ఆలీ స్టేజ్ మీదకు ఎక్కి డ్యాన్సులు చేశాడట. అది చూసిన బ్రహ్మానందం అచ్చి రెడ్డి, రైటర్ దివాకర్ బాబు, ఎస్వీ కృష్ణారెడ్డిలతో మాట్లాడట. ఆలీ హీరో మెటిరీయల్.. మా కమెడియన్లు కూడా అలా హీరోలుగా చూపించండి అని అడిగాను.

    అలా యమలీల పుట్టింది. ఇదే విషయాన్ని ఈ మధ్య అచ్చిరెడ్డి గారు కూడా నాతో అన్నారు అంటూ బ్రహ్మానందం అన్నాడు. మొత్తానికి యమలీల సినిమా మాత్రం ఆలీ కెరీర్‌ను మలుపు తిప్పేసింది.

    Leave a Reply