• November 28, 2021

Akhanda Pre release Event : కాలు జారి కింద పడ్డాడు అయినా కూడా.. బాలయ్యపై బోయపాటి

Akhanda Pre release Event : కాలు జారి కింద పడ్డాడు అయినా కూడా.. బాలయ్యపై బోయపాటి

    Akhanda Pre release Event నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌‌లో రాబోతోన్న హ్యాట్రిక్ సినిమా అఖండ. ఇప్పటికే సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సింహా, లెజెండ్ వంటి చిత్రాల తరువాత రాబోతోన్న ఈ మూడో సినిమా రికార్డులు క్రియేట్ చేయబోతోన్నట్టుంది. డిసెంబర్ 2న రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి జరిగింది. ఈ ఈవెంట్‌కు రాజమౌళి, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

    ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ బాలయ్య డెడికేషన్ అభిమానుల మీదున్న ప్రేమను బయటపెట్టేశాడు. సినిమా షూటింగ్ అయిపోయిందని. ఇక ఒక్క పాట మాత్రమే మిగిలింది. అదే మీరు ఇప్పుడు బాలయ్య అనే మాస్ సాంగ్. దీని కోసం కోటిన్నర్ పెట్టి సెట్ వేయించాను. మాస్టర్ కూడా ప్రాక్టీస్ చేయించాడు. బాలయ్య రిహార్సల్ చేశాడు.

    ఒళ్లంతా నొప్పులు వస్తాయి. అవి పోవాలంటే స్ట్రెచింగ్ చేయాలి. ఇంటికెళ్లి బాలయ్య స్ట్రెచింగ్ చేశాడు. ఆ సమయంలో కాలి జారి కింద పడ్డాడు. బరువంతా కూడా భుజం మీద పడింది. దీంతో డిస్ లొకేట్ అయింది. ఆ విషయం నాకు తెలిసింది. గుండె జారింది. అవతల కోటిన్నర పెట్టి సెట్ వేశాను. ఇవతల బాలయ్య బాబుకు ఇలా జరిగింది. పాట అవసరం లేదని అన్నాను.

    కానీ బాలయ్య బాబు మాత్రం అభిమానుల కోసం చేద్దామని అన్నాడు. నా అభిమానులకు ఓ మాస్ పాట లేకపోతే ఇలా అని అన్నారు. చేస్తే మంచిగా చేయాలి.. లేదంటే లేదు అని అన్నారు. ఒక్కసారి దిగితే మాత్రమే నేను ఊరుకోను అని అన్నారు. సరే నీ ఇష్టం అని బాలయ్య అన్నారు. చేతికి కట్టు కట్టుకుని మరీ బాలయ్య ఆ పాట చేశాడు. అదీ ఆయనకు అభిమానుల మీదున్న ప్రేమ అని బోయపాటి చెప్పుకొచ్చాడు.

    Leave a Reply