- November 28, 2021
Nandamuri Balakrishna Akhanda: గుండె మీద చేయి వేసుకుని చూడొచ్చట!.. అఖండపై బోయపాటి కామెంట్స్

Nandamuri Balakrishna Akhanda బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో ఆయన స్పీచులు కూడా అలానే ఉంటుంది. సినిమాలోని అతికి తగ్గట్టే.. ఆయన ప్రసంగాల్లోనూ అతి ఉంటుంది. టీజర్ ట్రైలర్‌లు ఆయన సినిమా మీద అంచనాలు పెంచేయడంలో ఎంతో పాత్రను పోషిస్తాయో.. ఆయన మాటలు, ప్రసంగాలు కూడా అంతే పాత్రను పోషిస్తాయి. వినయ విధేయ రామ సమయంలోనూ ఎన్నెన్నో మాటలు అనేశారు.
గుండెల మీద చేయి వేసుకుని ఈ సినిమా చూడొచ్చు.. కాలర్ ఎగిరిసి బయటకు రావచ్చు అంటూ ఇలా ఎంతో అంచనాలు పెంచేశాడు బోయపాటి. తీరా వినయ విధేయ రామ సినిమా చూస్తే గుండెలు బద్దలయ్యాయి. ఇదేం సినిమారా భై అని అనుకునేంత దారుణంగా తీశాడు. ఒక్కటంటే ఒక్క లాజిక్ కూడా సినిమాలో ఉండదు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లు కూడా పనికి రారేమో అన్నంతగా తీశాడు బోయపాటి.
ఇక నిన్నటి అఖండ ఈవెంట్‌లోనూ సేమ్ కామెంట్లు చేశాడు బోయపాటి. కాలర్ ఎగిరేసేలా.. గుండె మీద చేయి వేసుకుని చూసేంత గొప్ప సినిమాను తీశామంటూ అఖండ గురించి దిక్కులు పెక్కటిల్లేలా చెప్పేశాడు. మరి ఈ సారి ఫలితం ఎలా వస్తుందో చూడాలి. అసలే బోయపాటి అందులో బాలయ్య.. ఇక విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరీ ముఖ్యంగా అఘోరా అంటూ రాబోతోన్నాడు. ఇక ఆ పాత్రను ఇంకెంతలా చూపించి ఉంటాడో.