- December 10, 2021
Akhanda Vijayotsova Jathara : బాలయ్య గొప్పదనం!.. బోయపాటి మాటల్లో

Nandamuri Balakrishna-Boyapati Sreenu నందమూరి అభిమానులంటే బాలయ్య ఎనలేని ప్రీతి. వారి కోసం బాలయ్య ఎంతటి రిస్క్ అయినా చేసేందుకు వెనుకాడరు. అందుకే అఖండ సినిమాలో భుజం విరిగినా కూడా జై బాలయ్య పాటను చేశాడు. ఇప్పుడు ఆ పాటే థియేటర్లో మార్మోగిపోతోంది. అయితే బాలయ్య తన అభిమానులను ఎంత ప్రేమిస్తాడో.. ఎంత జాగ్రత్తగా చూసుకుంటాబో బోయపాటి శ్రీను చెప్పాడు.
గురువారం నాడు విశాఖపట్నంలో అఖండ విజయోత్సవ జాతరను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో బాలయ్య గురించి బోయపాటి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అభిమానులు అంటే బాలయ్యకు ఎంతో ప్రేమ ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పాడు. వైజాగ్‌లో దిగి ఇలా మేం కారులో వస్తోంటే..వెనకాల బైకులు, కార్లతో అభిమానులు ఫాలో అవుతూ వచ్చారు.
బాలయ్య, జై బాలయ్య అంటూ వారు ఎంత అరుస్తున్నా కూడా బాలయ్య మాత్రం అటు వైపు చూడలేదు. అప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను. బాబు.. ఒక్కసారి వాళ్లకు చేయి ఊపుదామా? అని అన్నాను. కానీ బాలయ్య మాత్రం వద్దని అన్నారు. మనం చేయి ఊపినా, అద్దాలు దించి వారిని చూసినా కూడా ఉత్సాహంతో వారికి ఏదైనా జరగొచ్చు.. ప్రమాదం కూడా జరగొచ్చు. అందుకే మనం వారిని చూడనట్టుగా ఉండాలని అన్నారు.
అలా అభిమానులు ఎంత అరిచినా కూడా వారి క్షేమం కోసం ఒక్కసారి కూడా అటు చూడలేదు. నేను కూడా ఎంతగానో కంట్రోల్ చేసుకున్నాను. మీకు చిన్నగా ఏమైనా అయితే కూడా బాలయ్య బాబు తట్టుకోలేడు.. అది మీ మీద ఆయనకున్న ప్రేమ అంటూ బాలయ్య గొప్పదనం గురించి బోయపాటి చెప్పేశాడు.