• January 29, 2022

పెళ్లిపై అలాంటి అభిప్రాయం ఉందా?.. హిమజ రూటే సపరేటు

పెళ్లిపై అలాంటి అభిప్రాయం ఉందా?.. హిమజ రూటే సపరేటు

    Bigg Boss Himaja Marriage బిగ్ బాస్ ఫేమ్ హిమజకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ విషయం ఆమె యూట్యూబ్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. బిగ్ బాస్ షో గమనించినా కూడా తెలిసిపోతుంది. అయితే బిగ్ బాస్ హిమజ తన ఇన్ స్టాలో రెడ్డి అనే పేరును తొలగించడంతో కొత్త కొత్త అనుమానాలు చుట్టు ముట్టాయి. హిమజ కూడా డివోర్స్ తీసుకుంటోందని రూమర్లు వచ్చాయి. అయితే దీనిపై హిమజ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

    తనకు అసలు పెళ్లే కాలేదని, ఒక వేళ చేసుకుంటే ధూంధాంగా అందరికీ తెలిసేలా చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఎవరో నన్ను హింసిస్తున్నారని, డివోర్స్ తీసుకున్నానంటూ రకరకాల రూమర్లు వస్తున్నాయి. యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు, ఆర్టికల్స్ కూడా వచ్చాయట. మామూలుగా అయితే వాటిని నేను పట్టించుకోను. కానీ ఇంట్లో వాళ్లు, నా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

    నా తరుపున వాళ్లు గొడవకు దిగుతున్నారు. యూట్యూబ్ వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు.. ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు రాస్తారంటూ తన ఫ్యాన్స్ తన కోసం మాట్లాడుతున్నారు.. అలాంటి వారి కోసమే ఈ క్లారిటీ ఇస్తున్నాను అని హిమజ చెప్పుకొచ్చింది. ఎవరో కొందరు నా మీద ఓర్వలేక ఇలాంటివి డబ్బులు ఇచ్చి మరీ రాయిస్తున్నారు.. వాళ్లకు బుద్దిలేదు.. రాసేవాళ్లకు కూడా లేదా? అంటూ హిమజ ఫైర్ అయింది.

    ఇప్పుడు ఇళ్లు కట్టుకుంటున్నాను.. ట్రెండింగ్‌లో ఉన్నాను. జెలసీగా ఫీలై ఎవరో ఇలా చేసి ఉంటారు అని హిమజ తెలిపింది. ప్రస్తుతం సింగిల్‌గా హ్యాపీగా ఉన్నాను.. ఎక్కడికంటే అక్కడికి వెళ్తాను. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు అలా ఉండటమే ఇష్టం. నా వాళ్లను బాగా చూసుకుంటాను. నాకు పెళ్లి ఇప్పుడే చేసుకోవాలని లేదు. ఓ నాలుగైదేళ్ల తరువాత చేసుకుంటాను.. మంచి సంబంధం ఉంటే చెప్పండి అని సెటైర్లు వేసింది. అంటే మొత్తానికి సింగిల్‌గా ఇలా హ్యాపీగా ఉండేందుకే హిమజ ఇష్టపడుతోన్నట్టు కనిపిస్తోంది.

    Leave a Reply