- October 25, 2021
Dethadi Harika: బిగ్ బాస్ హారిక పెంచినావు కోరిక.. హాట్ పిక్స్ వైరల్

Dethadi Harika బిగ్ బాస్ ఇంట్లోకి హారిక ఎంట్రీనే అదిరిపోయింది. అప్పటి వరకు హారికను చూడని విధంగా ప్రేక్షకులు చూశారు. అంతకు ముందు యూట్యూబ్‌లో కాస్త పద్దతి గల బట్టలు ధరించి, తెలంగాణ యాసలో మాట్లాడటంతో హారికకు మంచి క్రేజ్ వచ్చింది. అలా దేత్తడి హారికగా మారిపోయింది. అలేఖ్య హారిక అని సొంత పేరు కాస్తా దేత్తడి వీడియోలతో అలా దేత్తడి హారికగా మారిపోయింది.
అయితే బిగ్ బాస్ ఇంట్లో హారిక ధరించిన బట్టలు ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యాయి. ఎప్పుడూ కూడా నిండు వస్త్రాలను ధరించినట్టు కనిపించలేదు. మిడ్డీ,చెడ్డీలు అంటూ దుమ్ములేపేసింది. అయితే కావాలనే అలాంటి బట్టలు వేసుకుంటోంది, ఓట్ల కోసం అలా చేస్తుందని అప్పట్లో కామెంట్లు వచ్చాయి. బిగ్ బాస్ షో ద్వారా హారిక మొదట్లో మంచి ఇమేజ్ తెచ్చుకుంది.
కానీ చివర్లో అభిజిత్‌ను వదిలి అఖిల్‌తో సన్నిహితంగా మారడంతో హారికకు దెబ్బ పడ్డట్టు అయింది. పైగా హారిక అభిజిత్ అన్నా చెల్లెళ్ల రిలేషన్‌తో ఉన్నారని బయటకు వచ్చాక చెప్పడంతో అసలు కథ యూటర్న్ తిరిగింది. అప్పటి వరకు హారికకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండేది. అభిజిత్ హారిక కలిసి అభిక అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు.
కానీ చివరకు అంతా తుస్సుమంది. ఇప్పుడు ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంటున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అభిజిత్, హారిక కలుసుకున్నది లేదు. అయితే హారిక మాత్రం ఫుల్ చిల్ అవుతోంది. అఖిల్, సోహెల్, అరియానాలతో కలిసి దుమ్ములేపుతోంది. అయితే బుల్లితెరపై మంచి అవకాశాలనే అందుకుంది. ఇప్పుడు హారిక వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. తనలోని హాట్ యాంగిల్‌ను ఇలా చూపించేసింది. హారిక.. నీ వల్లే కలిగింది కోరిక అనేలా చేస్తోంది.