• January 21, 2022

Actress Hari Teja : థూ అంటూ రెచ్చిపోయిన నెటిజన్.. హరితేజ స్వీటుగా ఘాటు రిప్లై

Actress Hari Teja : థూ అంటూ రెచ్చిపోయిన నెటిజన్.. హరితేజ స్వీటుగా ఘాటు రిప్లై

    Bigg Boss HariTeja బిగ్ బాస్ షోతో హరితేజ బాగా ఫేమస్ అయింది. అంతకు ముందు బుల్లితెరపై సీరియల్స్‌తో అల్లరి చేసింది. విలన్ పాత్రలతో అందరినీ భయపెట్టేసింది. అయితే బిగ్ బాస్ షోతో ఆమె ఫేట్ మారిపోయింది. ఆమెలో భిన్న రకాల ప్రతిభ బయటకు వచ్చేసింది. హరితేజ చెప్పే హరికథలు, ఆమె టైమింగ్, పంచ్‌లు వేసే విధానం అన్నీ కూడా అందరినీ మెప్పించాయి.

    అలా హరితేజకు వెండితెరపై కామెడీ రోల్స్ వచ్చాయి. తన స్టైల్లో కామెడీని పండిస్తూ దూసుకుపోతోంది. ఇక నెట్టింట్లోనూ తన అభిమానులతో హరితేజ ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా కొత్తగానే ఉంటుంది. దాదాపు నిత్యం తన అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ప్రతీ రోజూ అప్డేట్లను పెడుతూ ఉంటుంది. ఇక ఈ మధ్య వర్కవుట్లతో హరితేజ ఫుల్ బిజీగా మారింది.

    తన కూతురు భూమికి సంబంధించిన విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా హరితేజ వేసిన జోకులు, సెటైరికల్ పోస్ట్ కొందరికీ చిరాకు తెప్పించింది. ఆల్వేస్ పాజిటివ్ అని ఓ పోస్ట్ చేసింది.. పాజిటివ్ అంటే కరోనా పాజిటివ్ కాదండీ అని కామెంట్ చేసింది. డోలో సారీ.. బోలో అని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టేసింది.

    అయితే ఇలా ప్రస్తుత పరిస్థితిని కామెడీ చేయడంపై కొందరు నవ్వుకుంటూ ఉంటే.. ఇంకొందరు మాత్రం ఫైర్ అయ్యాడు. అందులోని ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. నువ్వూ నీ ఎదవ ఓవర్ యాక్టింగ్.. ఇంత సీరియస్ పరిస్థితుల్లో కూడా నీ పిచ్చి సిల్లీ జోక్స్.. థూ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    అయితే నెటిజన్ అంత సీరియస్‌గా అలా మాట్లాడినా కూడా హరితేజ మాత్రం కంట్రోల్ తప్పలేదు. నవ్వుతూనే చురకలు అంటించినట్టు కనిపిస్తోంది. అబ్బో.. మస్త్ బీపీ వస్తోంది సార్ మీకా.. సల్లపడండి జర.. నవ్వుకుంటే అన్ని బాధలు పోతాయ్ అని నేను నమ్ముతా.. అంతే.. మరీ అంత రూడ్‌గా ఉండకండి అని హరితేజ స్వీటుగా రిప్లై ఇచ్చింది.

    Leave a Reply