- November 7, 2021
అభిజిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పులి వేట మొదలు!

అభిజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేందుకు రెడీగా ఉంది. బిగ్ బాస్ విజేతగా అభిజిత్ నిలిచాడు. ఎంతో మంది అభిమానాన్ని గెలిచాడు. మిస్టర్ పర్ఫెక్ట్‌కు మంచి ఉదాహరణగా నిలిచాడు. అలా అభిజిత్ తన ప్రవర్తన, తన నిజాయితీతో ఎంతొ మందిని ఆకట్టుకున్నాడు. అయితే అభిజిత్ మాత్రం బిగ్ బాస్ తరువాత అంతగా యాక్టివ్‌గా లేడు. సినిమాలను ప్రకటించే విషయంలోనూ అభిజిత్ ఎంతో వెనుకబడ్డాడు.
నోయల్, సోహెల్, అఖిల్, మెహబూబ్, అరియానా, దివి, మోనాల్ వంటి వారు కుప్పలు తెప్పలుగా సినిమాలను ఒప్పేసుకున్నారు. చకచకా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నారు. అయితే అభిజిత్ మాత్రం ఎన్నో మార్లు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి హింట్లు ఇచ్చాడు. తాను మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మాస్ ఎంటర్టైనర్, రామ్ కామ్, పూర్తిగా లవ్ స్టోరీ ఇలా కొన్ని కథలు వింటున్నాను త్వరలోనే ప్రకటిస్తాను అని అన్నాడు.
కానీ ఇంత వరకు అభిజిత్ తన ప్రాజెక్ట్‌ల గురించి ప్రకటించలేదు. మధ్యలో ఆయన హెల్త్ కండీషన్ కూడా సరిగ్గా లేదు. అందుకు కొంత గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా అభిజిత్ ఓ పోస్ట్ వేశాడు. అందులో కంబాలపల్లి కథలు ఫేమ్ ఉదయ్ గుర్రాల, గుడ్ లక్ సఖి డైరెక్టర్ నాగేశ్ కుకునూర్‌లతో కలిసి ఉన్నాడు. వారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు. అంటే ఓ షెడ్యూల్ ఆల్రెడీ ప్రారంభిచేశారన్న మాట. అయితే త్వరలోనే అభిజిత్ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతోంది. అంటే పులి అభిమానులకు ఇది గుడ్ న్యూస్‌లాంటిదే.