బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక మానస్‌ల ట్రాక్ గురించి ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ట్రాన్స్‌జెండర్ అయిన ప్రియాంక ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంది. గత సీజన్లో వచ్చిన తమన్నా సింహాద్రి మాదిరి కాదు. ఈమె ఎంతో సౌమ్యురాలు. ప్రియాంక తన మంచి తనంతో జనాల్లోనూ పాపులారిటీని తెచ్చుకుంది. మొత్తానికి ప్రియాంక ఇమేజ్ క్లీన్‌గానే ఉంది. కానీ ఆమె నడిపిస్తున్న ట్రాక్‌ల పట్ల మాత్రం క్లారిటీ లేదు. ఎవరితో ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు.
జెస్సీ, మానస్, శ్రీరామచంద్రలు తనకు బావలు అంటూ ప్రకటించేసింది. అందులో మానస్‌తో ప్రియాంక ఎక్కువ సన్నిహితంగా ఉంటోంది. కానీ నిన్నా మొన్నా కాస్త గొడవలు అయ్యాయి. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అయితే రాజా రాణి లెవెల్లో ఫీలై.. బ్రదర్ అంటూ మానస్‌ను ప్రియాంక పిలిచిందట. దీంతో మానస్ అదే ఫిక్సయ్యాడు. సిస్టర్ అని పిలిచేశాడు. అలా పిలవొద్దు ప్లీజ్ అంటూ మానస్‌ను ప్రియాంక బతిమిలాడింది. అయితే మానస్ మాత్రం ప్రియాంకకు కాస్త దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇది డే వన్ అని.. ఇలానే ఉంటామని, ఇక దూరంగా ఉండు అని ప్రియాంకకు మానస్ సూచించాడు. ప్లీజ్ ఇలా ఉండొద్దు.. నార్మల్‌గా ఉండు.. నన్ను గారు అని పిలవకు.. ఇది వరకటిలా ఉండు అంటూ మానస్‌ను బతిమిలాడింది. ఇంకోసారి తనతో ఇలా చేస్తే మాత్రం సీరియస్ అవుతాను అని ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి అలా చేయనులే అంటూ.. మానస్‌ను గట్టిగా హత్తుకుంది ప్రియాంక. ఇక ఆ సీన్‌ను కిచెన్ రూం నుంచి సన్నీ గమనించాడు. వాటే సీన్.. మిస్ అవుతున్నాం అంటూ.. సన్నీ అంటే.. అది ఫ్రెండ్లీ హగ్‌రా అంటూ కాజల్ కవర్ చేసేసింది.