- December 19, 2021
VJ Sunny : ఆ అమ్మాయి నన్ను బెదిరించింది!.. సన్నీ తల్లి కళావతి కామెంట్స్

బిగ్ బాస్ విన్నర్ సన్నీ.. ఈ మాట గత రెండు రోజుల నుంచి మార్మోగిపోతూనే ఉంది. సన్నీ ఫ్యాన్స్ దెబ్బకు ఓట్ల వర్షం కురిసినట్టు తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం ముగిసిన అనధికారిక ఓట్ల లెక్కల ప్రకారం.. సన్నీ టాప్‌లోకి వచ్చాడు. షన్ను రెండో స్థానాంలోనే ఉన్నాడు. అలా మొత్తానికి సన్నీ విన్నర్ అని అంతా అనుకుంటున్నారు. దీనికి తగ్గట్టే బయట ప్రచారం, ఆర్భాటాలు అన్నీ మొదలయ్యాయి.
తాజాగా సన్నీ మదర్ కళావతి చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సన్నీ అన్న విన్నర్ అని ప్రతీ ఒక్కరూ అంటున్నారు.. సన్నీని మా ఇంటికి తీసుకురండి.. భోజనం పెడతాం అంటూ ప్రతీ ఒక్కరూ అడుగుతున్నారు. కానీ నేను ఆ పని చేయలేను. మిమ్మల్నే మా ఇంటికి పిలుస్తాను.. రండి.. సన్నీతో ఫోటో దిగండి అని నేను అందరికీ చెబుతున్నాను అంటూ కళావతి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
అందరి నోటి చలువ వల్ల సన్నీ విన్నర్ అవ్వాలి అని కళావతి తన కోరికను బయటపెట్టేసింది. ఇక సన్నీని ఎంతో మంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. మొన్న ఓ సారి సన్నీ అన్నయ్య వస్తున్నాడు అని ఓ అమ్మాయితో అన్నాను. అన్నయ్య అంటున్నావ్ ఏంటి? అని ఆ అమ్మాయి నన్ను బెదిరించింది. ఏమనాలి మరి అని అంటే.. బావ అనాలి అంటూ నన్నే బెదిరించింది.
సన్నీకి కాబోయే భార్య పద్దతిగా ఉంటే చాలు.. కట్నం లాంటివి మేం ఏమీ తీసుసుకోం.. మా ఇద్దరి కొడుకుల విషయంలోనూ అలానే చేశాం. మా ఇద్దరి కోడళ్ల నుంచి కట్నాలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా అంతే. కానీ మాతో కలిసిపోవాలి.. మర్యాద తెలిసి ఉండాలి.. పద్దతిగా ఉండాలి అని సన్నీకి కాబోయే భార్య ఎలా ఉండాలో కళావతి ఎంతో గొప్పగా చెప్పింది.