- January 20, 2022
Siri Hanmanth : కరోనాతో సిరి.. ఇంటి ముందుకు వెళ్లి జెస్సీ హల్చల్

Siri Hanmanth-Jaswanth Padala బిగ్ బాస్ ఇంటితో సిరి, జెస్సీల బంధం ఏర్పడింది. బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్ను, జెస్సీలు ముగ్గురూ ఉన్నంత వరకు ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. అది ఫ్రెండ్ షిప్లానే అనిపించేది. జెస్సీ ముద్దులు అడిగినా, హగ్గులు అడిగినా కూడా అది ఫ్రెండ్ షిప్లానే ఉండేది. చివరకు తనకు తల్లిలా సేవలు చేసిందని జెస్సీ చెప్పిన మాటలకు అందరూ ఫిదా అయ్యారు.
ఎప్పుడైతే జెస్సీ అలా సీక్రెట్ రూంలోకి వెళ్లాడో.. అటు నుంచి అటే బయటకు వెళ్లాడే.. సిరి,షన్ను ట్రాక్ గాడి తప్పింది. అది ఫ్రెండ్ షిప్ అనుకుంటూనే చాలా దూరం వెళ్లేశారు. హగ్గులతో నానా పెంట పెట్టేశారు. అయితే ఈ ఇద్దరి రిలేషన్ మీద జరుగుతున్న ట్రోలింగ్, వస్తోన్న నెగెటివిటీ గురించి జెస్సీ పలుమార్లు హింట్ ఇచ్చాడు. కానీ వాళ్లు అంతగా పట్టించుకోలేదు.
తమ దారి తమదే అన్నట్టుగా వ్యవహరించారు. కానీ జెస్సీ మాత్రం ఎప్పుడూ కూడా తన ఫ్రెండ్స్ క్షేమం కోసమే చేశాడు. అలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలనేంతగా జెస్సీ ప్రభావం చూపించాడు. తాజాగా జెస్సీ చేసిన చేష్టలకు మరోసారి జనాలు ఫిదా అవుతున్నారు. సిరికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. మొన్న పాజిటివ్ వచ్చిందని సిరి ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే సిరి ఇంటి ముందుకు వెళ్లి జెస్సీ పలకరించాడు. దూరం నుంచే సిరిని చూపించాడు. దూరం నుంచే పలకరించాడు. ఇంట్లో ఉన్న సిరి.. కిందకు వచ్చింది. గేట్ అవతల సిరి..రోడ్డు మీద జెస్సీ ఉండి మాట్లాడుకున్నారు. మొత్తానికి ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉండాలని అంతా అనుకుంటున్నారు. అయితే సిరి మాస్క్ తీసేసి మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. జెస్సీ మాత్రం అస్సలు మాస్క్ తీయలేదు. దూరం నుంచే మాట్లాడాడు.