• January 12, 2022

బిగ్ బాస్ షోలోకి గృహలక్ష్మీ లాస్య!

బిగ్ బాస్ షోలోకి గృహలక్ష్మీ లాస్య!

    Gruhalakshmi Lasya-Anchor Prashanthi బిగ్ బాస్ షోలోకి వెళ్లాలనే కల కొంత మందికి ఉంటుంది. ఇంకొంత మంది అయితే పనీ పాటా లేనివాళ్లే అందులోకి వెళ్తారు అని అంటారు. అలా బిగ్ బాస్ షో మీద ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎవరిని ఎలా పాతాళానికి పడేస్తోందో.. ఎవరిని ఎలా అందళం ఎక్కిస్తోందో బిగ్ బాస్ షోకే తెలియదు. కొందరికి ఫేమ్ వస్త.. ఇంకొందరికీ తిట్లు, చీవాట్లే ఎదురవుతాయి.

    అయితే ఈ షో మీద గృహలక్ష్మీ సీరియల్‌లో తన విలనిజంతో ఆకట్టుకున్న యాంకర్ ప్రశాంతి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. లాస్య పాత్రలో యాంకర్ ప్రశాంతి సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతీ ఒక్కరూ ఆమెను తిడుతున్నారు.. ద్వేషిస్తున్నారు.. శాపనార్థాలు పెడుతున్నారంటే ఆమె ఎంతలా ఆ పాత్రలో జీవిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

    అలాంటి లాస్య ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి చెప్పుకొచ్చింది. మామూలుగా అయితే బిగ్ బాస్ ఐదో సీజన్, అందులోని కంటెస్టెంట్ల గురించి ప్రశాంతి చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. కంటెస్టెంట్లందరూ దాదాపు నా ఫ్రెండ్స్, నాకు తెలిసినవాళ్లే.. బయటి ఫాలోయింగ్‌ను బట్టి ఓట్లు వేయకండి.. ఇంట్లో ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వారికే ఓట్లు వేయండని తన అభిమానులకు ప్రశాంతి చెప్పుకొచ్చింది.

    ఇక ఇప్పుడు లాస్య బిగ్ బాస్ షో మీద, బిగ్ బాస్ షోకు అవకాశం వస్తే వెళ్తారా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ మధ్య లాస్య లైవ్‌లోకి వచ్చింది. ఇందులో బిగ్ బాస్ షో గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. బిగ్ బాస్ షోలోకి వెళ్తారా? అని నెటిజన్లు అడిగారు. దానికి ప్రశాంతి ఇచ్చిన సమాధానం అనుమానాలకు దారి తీస్తోంది. బిగ్ బాస్ షోకి వెళ్లను.. ఇప్పటికి అయితే అలాంటి ఆలోచన లేదు.. అని తప్పించుకుంది.

    అంటే ఇప్పుడు ఆ ఆలోచన లేదు గానీ భవిష్యత్తులో వెళ్తోందనే హింట్ ఇచ్చేసింది. అంటే ఏ సీజన్‌లో ప్రశాంతి వస్తుందో తెలీదు గానీ బిగ్ బాస్ షోకి మాత్రం లాస్య వస్తుందనేది ఖాయమనిపిస్తోంది. కానీ ఇప్పుడు ప్రశాంతి తన సీరియల్‌తోనే బాగా బిజీగా ఉంది.

    Leave a Reply