• November 9, 2021

సొంతిళ్లు అయింది ఇక బంగారం కొనుక్కోవాలట.. నాగార్జున పేరు ఎత్తని గంగవ్వ

సొంతిళ్లు అయింది ఇక బంగారం కొనుక్కోవాలట.. నాగార్జున పేరు ఎత్తని గంగవ్వ

    మై విలేజ్ షోతో గంగవ్వ ఫేమస్ అయింది. అక్కడి నుంచి బిగ్ బాస్ ఇంటి వరకు వెళ్లింది. ఇక గంగవ్వ మహానటిగా ఎన్నో నాటకాలు బిగ్ బాస్ ఇంట్లో వేసింది. గంగవ్వ ఉన్నంత కాలం ఇంట్లో ఆట ముందుకు వెళ్లలేదు. ప్రతీ ఒక్కరూ గంగవ్వ చుట్టూ చేరి మార్కులు కొట్టేదాం, తద్వార ఓట్లు పట్టేదామనే భ్రమలోనే ఉండేవారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా కూడా సేఫ్‌గా గంగవ్వను ముందు పెట్టి చేతులు దులుపుకునేవారు. అలా గంగవ్వ బయటకు వచ్చే వరకు ఆటలో మజా రాలేదు.

    గంగవ్వకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో చివరకు బయటకు పంపించేశారు. అయితే సొంతిళ్లు కట్టుకోవడం తన కల, తనకున్న పెంకుట్టిళ్లు కూడా శిథిలావస్థకు చేరిందని, తాళం కూడా ఇంటికి వేయను అంటూ తన ధీనావస్థ గురించి చెప్పింది. చివరకు ఇంటిని నిర్మించే బాధ్యతను నాగార్జున తీసుకుంటాను అని మాటిచ్చాడు. అయితే ఆ మాటలో నాగార్జున ఎంత వరకు సఫలం చేశాడో తెలీదు. గంగవ్వ గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన వీడియో మై విలేజ్ షోలో ఉంది.

    ఈ వీడియోలో గంగవ్వ ఇంటిని చూపించారు. ఇంటి చుట్టూ విశాలమైన స్థలం ఉంది. ప్రహారి గోడలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఇళ్లు కట్టే సమయంలో గంగవ్వ చాలా సతాయించిందని, ఏదీ ఒక పట్టాన ఒప్పుకోలేదని, అంతా తనకు ఇష్టమొచ్చినట్టు చేసుకుందని మై విలేజ్ షో టీం మెంబర్స్ అన్నారు. ముందున్న పెంకుటిళ్లే బాగుంది.. ఇప్పుడు ఈ ఇళ్లు ఎందుకు కట్టుకుందో అని అనిల్ అన్నాడు. మొత్తానికి గంగవ్వ అయితే ఇళ్లు కట్టేసుకుంది.

    అఖిల్, సావిత్రి ముఖ్య అతిథులుగా వెళ్లారు. అఖిల్ కట్నంగా కొంత డబ్బు ఇచ్చాడట. శివజ్యోతి అయితే గ్యాస్ స్టవ్ గిఫ్ట్‌గా ఇచ్చిందని చెప్పుకొచ్చింది. కానీ ఈ వీడియోలో ఎక్కడా కూడా నాగార్జున పేరును చెప్పలేదు గంగవ్వ. ఇక ఇళ్లు అయిపోయింది.. తరువాత ఏంటి? అని అడిగితే.. ఇక మాల్ కొనుకుంటాను అని చెప్పింది. మాల్ అంటే బంగారం.. ఒంటి మీద ఏమీ లేదు కదా? బంగారం కొనుకుంటుందట అని వివరించారు. మొత్తానికి గంగవ్వ జోరు మాత్రం మామూలుగా లేదు.

    Leave a Reply