- November 9, 2021
ఓ వైపు గృహప్రవేశం మరోవైపు విషాదం.. ఆ మరణంతో గంగవ్వ ఎమోషనల్

గంగవ్వ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశ వేడుక సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో తన కోరికను బయటపెట్టింది గంగవ్వ. తన పెంకుటిళ్లు గురించి చెబుతూ.. సొంతంగా ఓ ఇళ్లు కట్టుకోవాలని ఉందని చెప్పడం.. ఓ ఇళ్లు కట్టిస్తానని నాగార్జున మాటివ్వడం అందరికీ తెలిసిందే. మొత్తానికి గంగవ్వ ఇళ్లు పూర్తయింది. అది బిల్డింగ్ కాకపోయినా కూడా.. చుట్టూ విశాలమైన స్థలం ఉంది.
వాస్తు చూడకుండా ముందే ఓ గోడను కట్టేశారట. దీంతో రెండో గోడ కూడా కట్టాల్సి వచ్చింది. రెండు బెడ్రూంలు, ఓ విశాలమైన హాల్, పూజ గది, వంటగదితో గంగవ్వ ఇళ్లు కళకళలాడిపోయింది. అతిథుల రాకతో గంగవ్వ తెగ మురిసిపోయింది. ఇంత ఇరకు తన ఇంట్లో ఇంత సందడి వాతావరణం ఎప్పుడూ చూడలేదంటూ గంగవ్వ తెగ సంబరపడిపోయింది. అయితే ఈ సంబరంలోనూ ఓ విషాద ఘటన జరగడంతో కాస్త బాధపడింది గంగవ్వ.
తన తమ్ముడి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడట. సిటీలో ఉద్యోగం మానేసి ఊరికి వచ్చాడట. ట్రాక్టర్ కొనుకున్నాడట. కానీ స్నేహితులతో తిరిగి అప్పులపాలైండట. పురుగుల మందు తాగాడట. కొంచమే తాగిండు కానీ.. అది ఎవ్వరికీచెప్పలేదు. తెల్లారి చెప్పడంతో అది కిడ్నీల వరకు వెళ్లింది.. మొన్నటి వరకు హాస్పిటల్‌లో ఉండే.. నిన్ననే చనిపోయిండు.. వాళ్లకే అలా అయింది.. వాళ్లు రాలేదనే బాధ ఒక్కటే ఉందంటూ తన గృహ ప్రవేశ వేడుక గురించి చెప్పేసింది.