• September 11, 2024

బిగ్ బాస్ ఇంట్లో కాస్త సరదా.. ఇంకాస్త చిరాకు.. శేఖర్ బాషా ఆణిముత్యాలివే

బిగ్ బాస్ ఇంట్లో కాస్త సరదా.. ఇంకాస్త చిరాకు.. శేఖర్ బాషా ఆణిముత్యాలివే

    బిగ్ బాస్ ఇంట్లో గొడవలు పెట్టుకునే వారు.. టాస్కుల కోసమే పుట్టినట్టుగా ఆడేవారు ఉంటారు.. ఎంటర్టైన్ చేయాలని కొందరు అనుకుంటారు. శేఖర్ బాషా మాత్రం తన పంచ్‌లు, సెటైర్లతో అందరినీ చంపేయాలని మాత్రం ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. శేఖర్ బాషా ఆర్జేగా బాగానే సుపరిచితుడు. రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ వల్ల మరింతగా ఫేమస్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో శేఖర్ బాషా ఆణిముత్యాలు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే.

    సెల్ ఫిష్.. సెల్ఫిష్.. చేపలు అమ్మడం.. దోమ.. దో.. మా.. ఇద్దరు అమ్మలు.. చిరాకు.. చీ రాకు.. చుడీదార్.. చూడీ దారుణం.. ఇలా ఒకటేమిటీ సందు దొరికినప్పుడల్లా ఏదో ఒకటి వేస్తూనే ఉన్నాడు. మనుషులంతా కూడా సెప్టెంబర్లోనే ఎక్కువగా పుడతారు? ఎందుకో తెలుసా? అని షాక్ ఇచ్చాడు. సెప్టెంబర్ అంటే తొమ్మిదో నెల కదా.. అందరూ తొమ్మిది నెలలకే పుడతారు కదా? అని తన తెలివిని ప్రదర్శించాడు.

    ఇలా శేఖర్ బాషా వేస్తున్న పంచ్‌లు, సెటైర్లకు కంటెస్టెంట్లు, ఆడియెన్స్ కొన్ని సార్లు నవ్వుకుంటున్నారు.. ఇంకొన్ని సార్లు తల పట్టుకుంటున్నారు. ఇదెక్కడి టార్చర్ రా బాబు అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలా శేఖర్ బాషా మాత్రం తన మాటల తూటాల్ని, పద విరుపుల్ని మాత్రం ఆపడం లేదు.

    శేఖర్ బాషాని అలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా.. అంటూ మీమ్స్,ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సారి శేఖర్ బాషా మాత్రం తన స్టైల్లో ఎంటర్టైన్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. చూస్తుంటే శేఖర్ బాషా చివరి వరకు ఉండేలా కనిపిస్తున్నాడు.