• August 22, 2025

బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. మినిమం డిగ్రీకి ఎదురుదెబ్బ

బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. మినిమం డిగ్రీకి ఎదురుదెబ్బ

    బిగ్ బాస్ అగ్నిపరీక్షకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ వచ్చేసింది. బిగ్ బాస్ 9 స్టార్ట్ అవ్వక ముందే అగ్నిపరీక్షతో సోషల్ మీడియా ఊగిపోతోంది. మొత్తంగా 45 మందిని సెలెక్ట్ చేసి.. వారిలోంచి ఫిల్టర్ చేసి చివరకు 5 మందిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించేలా ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఫిల్టరేషన్ కోసం నవదీప్, అభిజిత్, బిందు మాధవిలు జడ్జ్‌లుగా వచ్చారు. ఈ క్రమంలో వచ్చిన మొదటి ఎపిసోడ్‌లో కొంత మందిని హోల్డ్‌లో పెట్టారు.. ఇంకొంత మందిని టాప్ 15లోకి పంపించారు.. మరి కొంత మందిని నేరుగా బయటకు పంపించేశారు.

    దివ్యా నిఖిత, ప్రసన్న అనే వారిని టాప్ 15లోకి పంపించారు. హరీష్, ప్రియా, కేతమ్మ, అబు బక్కర్ వంటి వారిని హోల్డ్‌లో పెట్టారు. ఇక మల్టీస్టారర్ మన్మథరాజాని మాత్రం వెంటనే ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ ఇంట్లోకి తనను పంపించాలంటూ ధర్నాలు చేసిన ఈ వ్యక్తి నటనా కౌశలాన్ని చూసి జడ్జ్‌లు జడుసుకున్నారు. ఇక అతని యాక్టింగ్ చూసిన వెంటనే జడ్జ్‌లు రెడ్ సిగ్నల్ ఇచ్చారు.

    ఇతడ్ని ఎలిమినేట్ చేయకపోతే జనాలు తిడతారు అంటూ నవదీప్ కౌంటర్ వేశారు. ఇక మాధురి అనే అమ్మాయిని కూడా ఎలిమినేట్ చేశారు. ఇన్ ఫ్లూయెన్సర్, మోడల్ అని చెప్పి.. సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో తన తండ్రి సెక్యూరిటీ అని తెలిపింది.. ఆ సీఎంఆర్కే మోడల్ అవ్వాలి.. అదే తన కల అని మాధురి తెలిపింది. కానీ ఆమె చేసిన యాక్టింగ్, స్కిట్ ఇవేవీ కూడా బిగ్ బాస్ షోకు సరిపోదని, ఇంకా టైం ఉందని ఆమెను బయటకు పంపించేశారు.