• September 11, 2024

బిగ్ బాస్‌ ఇంట్లో ఇక ఇదే.. మాటలు తూలుతున్న సోనియా

బిగ్ బాస్‌ ఇంట్లో ఇక ఇదే.. మాటలు తూలుతున్న సోనియా

    బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఇప్పుడు నడుస్తోంది. మొదటి వారంలో బేబక్కను ఇంటి నుంచి పంపించేశారు. ఇక రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. బిగ్ బాస్ ఇంట్లో మొదటి రెండు మూడు వారాలు ఆడ కంటెస్టెంట్లే ఎలిమినేట్ అవుతుంటారు. ఆది ఆనవాయితీగా వస్తూనే ఉంది. పైగా మొదటి వారం కాస్త పెద్దవాళ్లు.. అంటే ఆంటీ టైపు కంటెస్టెంట్లే బయటకు వెళ్తుంటారు. కల్పన నుంచి బేబక్క వరకు దాదాపు ఇదే జరుగుతూ వచ్చింది.

    బిగ్ బాస్ తన కంటెస్టెంట్లకు నెగెటివిటీ వచ్చినా పర్లేదు.. టీఆర్పీ వస్తోంది కదా? అన్నట్టుగా ఆటలు ఆడిస్తుంటారు. కొందరికి ఫేవర్‌గా బిగ్ బాస్ టీం వ్యవహరిస్తుంటుంది. కొందరిని కావాలనే నెగెటివ్ యాంగిల్‌లో చూపిస్తుంటాడు. ఇక ఇప్పుడు నడుస్తున్న ఈ ఎనిమిదో సీజన్‌లో రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. ఉప్పు, పప్పు, డస్ట్ బిన్ అంటూ గొడవలు జరుగుతున్నాయి.

    కారెక్టర్, బట్టలు వేసుకోవడం.. అంటూ లేడీ కంటెస్టెంట్లు వాగ్వాదానికి దిగుతున్నారు. విష్ణు ప్రియ డ్రెస్సింగ్ మీద సోనియా కామెంట్ చేసింది. విష్ణుప్రియను సోనియా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇష్టమొచ్చినట్టుగా సోనియా మాట్లాడేస్తోంది. విష్ణుప్రియకి అమ్మానాన్న లేరన్నట్టుగా అనేస్తోంది. నీకు ఫ్యామిలీ లేదోమో.. నాకు ఫ్యామిలీ ఉందని సోనియా కాస్త హద్దులు దాటుతూ మాట్లాడేస్తోంది.

    విష్ణు ప్రియ వేసుకునే బట్టల మీద సోనియా కామెంట్లు చేస్తోంది. కానీ తాను చేసే పనులేంటో సోనియాకు అర్థం కావడం లేదు. ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్లు చాలా మంది ఉన్నారని, ఇప్పుడే ఎలిమినేట్ కాబోమని చాలా ఓవర్ కాన్పిడెంట్‌గా మాట్లాడుతోంది. సోనియాకు ఇప్పుడు నెట్టింట్లో నెగెటివిటీ ఎక్కువగా పెరిగిపోయింది. సోనియాకి ఇప్పుడు ఎంత నెగెటివిటీ ఉన్నా కూడా.. టాప్ 5 వరకు వెళ్లేలా కనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.