• September 23, 2023

Bigg Boss 7 elimination : దామిని టాలెంట్‌కు రాని ఓట్లు?.. సింగర్ అవుట్!

Bigg Boss 7 elimination : దామిని టాలెంట్‌కు రాని ఓట్లు?.. సింగర్ అవుట్!

    Singer Damini elimination బిగ్ బాస్ ఇంట్లో దామిని టాలెంట్‌ను జనాలు అంతగా పట్టించుకోలేదనిపిస్తోంది. ఈ మూడు వారాల్లో దామిని తన అందాల ప్రదర్శన తప్పా చేసిందేమీ లేదు. దామిని తన ప్రవర్తన ఏమాత్రం ఓట్లను తెప్పించలేకపోయింది. టాలెంట్ చూపించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దామిని తన భారీ అందాలను ఎంతగా చూపించినా, వీకెండ్ ఎపిసోడ్‌లో ఎద అందాలను ఎంతగా ప్రదర్శించినా కూడా ఓట్లు మాత్రం పడలేదు.

    ఈ మూడో వారంలో దామిని ఎలిమినేట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఈ మూడో వారంలో జరిగిన టాస్కులు, వారి వారి పర్ఫామెన్సులు పట్టి చూస్తే యావర్‌ ఓడినా కూడా నిజమైన విన్నర్‌గా నిలుస్తాడు. అతనికి పదే పదే అన్యాయం జరుగుతోందని జనాలు కూడా ఫీల్ అయ్యారు. అందుకే ఓటింగ్‌లో టాప్ పొజిషన్‌లోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

    దామిని, శుభ శ్రీలు లీస్ట్ ఓటింగ్‌తో ఉన్నారనిపిస్తోంది. ఇక దామిని అయితే పగబట్టినట్టుగా యావర్ మీద తన కక్షను తీసుకున్నట్టు అనిపించింది. అదే ఆమె కొంప ముంచినట్టుగా తెలుస్తోంది. ఆమె ఇంట్లో ఉన్నా కూడా ఆడేదేమీ లేదని, టాలెంట్ చూపించడం తప్పా ఇంకేం చేయడం లేదని జనాలు భావించినట్టుగా ఉన్నారు. ఈ వారం ఆమెను ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.