- October 28, 2023
అమ్మాయిలని కనికరించిన బిగ్ బాస్.. అతడి ఎలిమినేషన్‌కు కారణాలివే
Bigg Boss 7 Telugu 8th Week Elimination బిగ్ బాస్ ఏడో సీజన్లో ఇప్పటి వరకు ఏడు ఎలిమినేషన్లు జరిగాయి. ఈ ఏడు వారాల్లో వరుసగా లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూనే వచ్చారు. కిరణ్, షకిలా, దామిని, రతికి, శుభ శ్రీ, నయని, పూజా ఇలా అందరూ అమ్మాయిలే ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇదేంటి ఇలా జరుగుతోందని అంతా అనుకున్నారు. అయితే ఇందులో అన్ని ఎలిమినేషన్లు జనాలు ముందే ఊహించారు. ఒక్క నయని విషయంలోనే తేడా కొట్టేసింది. రతిక అంత త్వరగా వెళ్తుందని అయితే జనాలు అనుకోలేదు. కానీ ఆమె మీద విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. అయినా ఇప్పుడు ఆమెను ఇంట్లోకి తిరిగి తీసుకున్నాడు బిగ్ బాస్. ఈ ఎనిమిదో వారంలో మగ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది.
ఈ ఎనిమిదో వారంలో సందీప్ మాస్టర్ బయటకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడు వారాల్లో ఎప్పుడూ నామినేషన్లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడాడు. మొదట్లోనే పవర్ అస్త్రను సొంతం చేసుకున్నాడు. అలా మొదటి నాలుగు వారాలు సేఫ్ అయ్యాడు. ఆ తరువాత అందరి పవర్ అస్త్రలు బిగ్ బాస్ లాగేసుకున్నాడు. ఐదు, ఆరు, ఏడు వారాల్లోనూ నామినేషన్లోకి రాకుండా గేమ్ ఆడాడు. సీరియల్ బ్యాచ్‌తోనే ఎక్కువగా సందీప్ మాస్టర్ ఉంటూ వచ్చాడు. ప్రియాంక, శోభ, అమర్‌ల గ్యాంగులోనే సందీప్ మాస్టర్ ఇరుక్కుపోయాడు.
యావర్, పల్లవి ప్రశాంత్‌లను ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే వచ్చాడు. వారితో ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నాడు. ఇక శివాజీ గ్యాంగులో యావర్, పల్లవి ఉంటే.. సీరియల్ బ్యాచ్ అంతా ఒక గ్యాంగులా ఉంటూ వచ్చింది. సందీప్ మాస్టర్ ఎప్పుడూ కూడా సీరియల్ బ్యాచ్ వైపే మొగ్గు చూపుతూ ఉండేవాడు. సంచాలక్‌గానూ ఎన్నో సార్లు సందీప్ మాస్టర్ ఫెయిల్ అయ్యాడు. సరైన టైంలో సరైన స్టాండ్ ఎప్పుడూ కూడా తీసుకున్నట్టుగా కనిపించదు.
ఓ కంటెస్టెంట్ స్ట్రాంగా? లేదా? అన్న నామినేషన్ల ద్వారానే తెలుస్తోంది. ఒక సారి నామినేషన్లోకి వెళ్లి సేవ్ అయి వస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది.కానీ ఈ సీజన్‌లో సందీప్ మాస్టర్ నామినేషన్ అనేది చూడలేదు. ఇలా సడెన్‌గా నామినేషన్లోకి వచ్చాడు. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడు. అయితే సందీప్ మాస్టర్ టాప్ 5 కంటెస్టెంట్లలో ఉంటారని చాలా మంది భావించారు. టాస్కుల్లో పోటాపోటీగా ఉంటాడు.. ఆటలు ఆడుతుంటాడు. కానీ మిగతా విషయాల్లో సందీప్ మాస్టర్ పూర్‌గా నిలిచాడు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో సందీప్ మాస్టర్ అంతగా కనిపించలేదు.
పాజిటివ్‌గానే నామినేట్ చేస్తున్నా.. ఒకసారైనా నామినేషన్‌లోకి వెళ్లొస్తే.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది.. అందుకే నామినేట్ చేస్తున్నా అని తేజ నామినేట్ చేశాడు. ఇలా ఒక్కసారి నామినేట్ అయి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ముందు నుంచి కూడా సందీప్ నామినేషన్లో ఉంటే.. ఆయన ఓటింగ్ సత్తా, ఫాలోవర్లు, ఫ్యాన్స్ లెక్కలు తెలిసి వచ్చేవి. కానీ అది ఆలస్యం అయింది. ఫలితంగా శోభా శెట్టి సేఫ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ ఒక్క వారమైనా అమ్మాయిలను బిగ్ బాస్ కనికరించినట్టు అయింది.