- October 8, 2023
శుభ శ్రీ అవుట్.. ఇకపై ఆట కాదు.. వేట.. ఐదో వారంలో మార్పులు చేర్పులు
బిగ్ బాస్ ఇంట్లో ఐదు వారాలు గడిచాయి. నాలుగు వారాల్లో లేడీ కంటెస్టెంట్లు బయటకు వెళ్తూ ఉన్నారు. ఈ ఐదో వారంలోనూ లేడీ కంటెస్టెంటే మళ్లీ ఎలిమినేట్ అయింది. దీంతో ఇంట్లోంచి ఐదుగురు లేడీ కంటెస్టెంట్లు బయటకు వెళ్లినట్టు అవుతుంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక బయటకు వచ్చారు. ఈ రోజు శుభ శ్రీ ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది. అలా మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లోంచి అందరూ లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇక ఇంట్లో ఇప్పుడు ప్రియాంక, శోభా శెట్టిలు మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా మగ కంటెస్టెంట్లు.
ఈ ఐదో వారంలో చాలానే మార్పులు చేర్పులు జరగబోతోన్నాయి. యావర్, గౌతమ్‌లను సీక్రెట్ రూంలోకి పంపిస్తున్నారట. అలా ఐదుగురు బయటకు, ఇద్దరు సీక్రెట్ రూంలోకి వెళ్తే.. మిగిలింది ఏడుగురు కంటెస్టెంట్లే. అయితే బయటకు వెళ్లిన ఐదుగురి స్థానంలో ఐదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయట. ఆ ఐదుగురిలో అంతో ఇంతో కాస్త పాపులారిటీ ఉంది ఒకే ఒక్క కంటెస్టెంట్‌కు. దేవత సీరియల్‌లో హీరోగా నటించిన అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోన్నాడట. మిగిలిన వారి మీద అంతగా హోప్స్ కూడా లేవు.
కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంతా ఒక గ్రూపుగా ఉంటే మాత్రం ఆట రంజుగా మారుతుంది. సీక్రెట్ రూంలో ఉన్న వ్యక్తుల్ని బిగ్ బాస్ ఎప్పుడు బయటకు వదులుతాడో చూడాలి. ఆరో వారం నుంచి ఆట ఆటలా కాకుండా వేటలా ఉండేలా కనిపిస్తోంది. రాను రాను మరింత టఫ్‌గా మారేలా ఉంది. మున్ముందు రోజుల్లో డబుల్ ఎలిమినేషన్లు కూడా ఉంటాయనిపిస్తోంది.