Rathika Elimination : రతిక ఎలిమినేషన్.. కారణాలు ఇవే

Rathika Elimination : రతిక ఎలిమినేషన్.. కారణాలు ఇవే

    Bigg Boss 7 Telugu 4 The Week Elimination బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం గడిచేందుకు వచ్చింది. ఈ నాలుగో వారం ఎలిమినేషన్ మీద ముందు నుంచి అందరికీ ఓ అంచనా ఉండేది. కానీ చివరకు అదంతా తారు మారైంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంట్లోంచి కిరణ్ రాథోడ్,షకిలా, దామిని ఇలా అంతా లేడీ కంటెస్టెంట్లు బయటకు వెళ్తూనే ఉన్నారు. ఈ సారి కచ్చితంగా మగ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడని, అది తేజనే అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ చివరకు ఓటింగ్ తారుమారైంది. ఎవరు చేసుకున్న కర్మ వారికే తగులుతుంది అన్నట్టుగా రతిక బలి అయిపోయింది. ఈ నాలుగో వారంలో రతిక ఎలిమినేట్ అయిపోయింది.

    రతికకు ముందు నుంచీ కూడా ఏమంతా పాజిటివ్ ఇమేజ్ లేదు. రాహుల్ సిప్లిగంజ్ మాజీ లవర్ అనే ట్యాగుతోనే ఇంట్లోకి వచ్చి.. ఆ సింపతీ కార్డ్ వాడుకోవాలని చూసింది. పదే పదే తన మాజీ గురించి తీస్తూ రాహుల్ ఫ్యాన్స్ ఓట్లు సంపాదించాలనుకుంది. లేదా సంపితీ కొట్టేయాలని చూసింది. కానీ అక్కడే ఆమెకు మొదటి దెబ్బ పడింది. ఎక్స్ అంటూ పదే పదే చెప్పడంతో జనాలు విసిగిపోయారు. ఇక రాహుల్ సైతం పరోక్షంగా మండిపడ్డాడు. తన పేరుని ఇంకా కొందరు వాడుకుంటున్నారు.. పర్సనల్ ఫోటోలను ఇలా లీక్ చేయించి.. నాటకాలు ఆడుతున్నారు అని ఫైర్ అయ్యాడు.

    రాహుల్ వ్యవహారం ఒక కారణం కాగా.. రెండోది పల్లవి ప్రశాంత్. మొదటి వారంలో ఈ ఇద్దరూ చిలకా గోరింకలా తిరిగారు. అన్నం ముద్దలు కూడా పెట్టింది. బాగానే అల్లుకుపోయింది. అది స్క్రీన్ స్పేస్, పుటేజ్ కోసం రతిక, ప్రశాంత్ చేశారని అర్థం అవుతూనే ఉంది. కానీ రెండో వారంలో తేడా కొట్టేసింది. ప్రశాంత్‌ను రతిక టార్గెట్ చేసింది. ఆ తరువాత యావర్‌ను పట్టుకుంది. ఓ వారం బాగానే అనిపించినా.. మళ్లీ యావర్‌కే వెన్ను పోటు పొడిచింది. ఇక రతిక గుణం తెలుసుకుని యావర్ సైతం దూరంగా ఉంటున్నాడు.

    ఇప్పుడు అమర్ దీప్ గ్యాంగులో చేరింది. ఒకప్పుడు శివాజీ గ్యాంగులో ఉండేది. అమర్ దీప్‌తో చేరాక రతిక మరింత పీక్స్‌కు వెళ్లింది. అసలే ప్రశాంత్ అంటే అమర్ దీప్‌కి సైతం అంతగా నచ్చదు. ఈ ఇద్దరూ కలవడం, ప్రశాంత్‌ను దారుణంగా టార్గెట్ చేయడం ఈ వారం ప్రేక్షకులు చూశారు. బిగ్ బాస్ ఇంటికి రతికలా కాకుండా రాధికలా మారింది. రతిక కాదు రాధిక అంటూ నెట్టింట్లో ట్రోల్స్ సైతం వచ్చాయి. బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్లు సైతం రతిక కాదు రాధిక అని మొహం మీదే అనేస్తున్నా.. వాస్తవంలోకి రాకుండా.. ఇంకా తనేదో గొప్పగా అనుకుని తన పంథాను మార్చుకోకుండా.. చేతులు కాల్చుకుని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చింది.

    కొన్ని చోట్ల రతిక తన పాయింట్‌ను బలంగా వినిపిస్తుంటుంది. అది తప్పో ఒప్పో పక్కన పెడితే ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఇక అందాల ప్రదర్శన చేయడంలోనూ రతిక తన పద్దతిని ఫాలో అయింది. మామూలుగా అయితే టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉండాల్సిన అర్హత గల కంటెస్టెంట్. కానీ ఒకరిని పదే పదే టార్గెట్ చేయడం, కించ పర్చడం, తన పద్దతితో విసిగించడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.