• November 13, 2021

Shanmukh Jaswanth: రేర్ ఫీట్.. షన్ను క్రేజ్‌కు నిదర్శనం ఇదే

Shanmukh Jaswanth: రేర్ ఫీట్.. షన్ను క్రేజ్‌కు నిదర్శనం ఇదే

    Shanmukh Jaswanth బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, యాంకర్ రవి వంటి వారికి ఎక్కువగా క్రేజ్ ఉంది. అయితే షన్నుకి మాత్రం మామూలుగా ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. యూట్యూబ్ సూపర్ స్టార్‌గా షన్నుకు మంచి క్రేజ్ ఉంది. అయితే బిగ్ బాస్ ఇంట్లోషన్నుని చూసి కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు ప్రేమిస్తున్నారు. అయితే నిన్న జరిగిన రచ్చతో మాత్రం నెట్టింట్లో చిన్నపాటి యుద్దమే జరిగింది.

    సన్నీ వర్సెస్ షన్ను అన్నట్టుగా మారింది. ఒక వైపు సన్నీ అభిమానులు.. మరో వైపు షన్ను అభిమానులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఎవరి సత్తా ఏంటో చూపించేందుకు ట్రెండ్‌ల మీద ట్రెండ్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం MrCoolShannu షన్ను అనే హ్యాష్ ట్యాంగ్ ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. రకుల్ ప్రీత్, నందమూరి బాలకృష్ణల సినిమా అప్డేట్లు వచ్చినా కూడా షన్ను ట్రెండ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

    అంటే అక్కడే షన్ను స్టామినా ఏంటో అర్థమవుతుంది. బయట షన్నుకు ఎంతటి బలమైన ఫ్యాన్ బేస్ ఉందో అర్థమవుతోంది. నిన్నటి గొడవలో సన్నీ చాలా మాటలు వదిలేశాడు. నోటికొచ్చినట్టు తిట్టేశాడు. యూట్యూబ్ వరకే అంటూ ప్రొఫెషన్ మీద కామెంట్ చేశాడు. సన్నీ మీద అందరికీ నెగెటివ్ అభిప్రాయం ఏర్పడింది. కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, మాటలను అలా వదిలేయడంతో సన్నీ చిక్కుల్లో పడ్డట్టు అయింది. మరో వైపు సిరి కూడా సన్నీని బాగానే రెచ్చగొట్టేసింది.

    Leave a Reply