Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu : ఏ ఒక్కరినీ వదిలిపెట్టడట!.. రంగంలోకి దిగిన యాంకర్ రవి

Anchor Ravi బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక పాజిటివ్ ఇమేజ్, నెగెటివ్ ఇమేజ్‌లోంచి ఏదో ఒకటి కచ్చితంగా వస్తుంది. అయితే ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌కు మాత్రం కచ్చితంగా ట్రోలింగ్ అనేది ఎదురవుతుంటుంది. కంటెస్టెంట్లతో పాటు ఫ్యామిలీ మెంబర్లను కూడా ట్రోల్ చేస్తుంటారు. అయితే వీటిపై కొందరు సీరియస్‌గా రియాక్ట్ అవుతుంటారు. ఇంకొంత మంది లైట్ తీసుకుంటారు.

కానీ యాంకర్ రవి మాత్రం వీటిని చాలా సీరియస్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ ఇంట్లో రవి ఉన్నప్పుడు విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. రవితో పాటు ఆయన భార్య నిత్య, పాప వియాను కూడా కొంత మంది ఆకతాయిలు దారుణంగా ట్రోల్ చేశారు. వాటిపై యాంకర్ రవి ఆల్రెడీ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసేశాడు. అయితే పరుష పదజాలంతో నెటిజన్లు చేసే కామెంట్లను కూడా యాంకర్ రవి వదలడం లేదు.

తాజాగా యాంకర్ రవి కొంత మంది చేసిన ట్రోల్స్, పెట్టిన బూతులకు సంబంధించిన స్క్రీన్ షాట్లు చేశాడు. వాటిపైన కూడా కంప్లైంట్ చేశానని యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. సైబర్ క్రైమ్ పోలీసులతో చేసిన చాటింగ్‌ను కూడా యాంకర్ రవి బయటపెట్టేశాడు. దీంతో అందరికీ ఓ స్వీట్ వార్నింగ్ లాంటిది రవి ఇచ్చేశాడు. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారంటూ ఫైర్ అయ్యాడు రవి.

నెగెటివ్ కామెంట్స్, బ్యాడ్ లాంగ్వేజ్, డర్టీ రిప్లైస్, ఎవరి మీద చేసినా ఎవరి గురించి చేసినా, ఎప్పుడు చేసినా సరే ఇప్పటి నుంచి ఉపేక్షించేది లేదు.. ఫేక్ అకౌంట్లు కూడా ట్రాక్ చేయబడతాయి.. లీగల్‌గా ఎంత దూరం వెళ్లేందుకైనా సరే నేను సిద్దం.. ఇప్పటి వరకు చేసింది చాలు అంటూ ట్రోలర్లకు గట్టిగా గడ్డి పెట్టాడు.

Exit mobile version