• September 18, 2024

సిగ్గు లేని సోనియా.. రంగు బయటపడేలా చేసివ యష్మీ

సిగ్గు లేని సోనియా.. రంగు బయటపడేలా చేసివ యష్మీ

    బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం మజా వచ్చేలా ఉంది. ఇన్ని రోజులు యష్మీ క్లాన్‌లో సోనియా, నిఖిల్, పృథ్వీ, అభయ్ ఇలా అందరూ ఉండి.. ఓ గ్రూప్‌లా గేమ్ ఆడారు. సోనియా ఆ క్లాన్ మెంబర్లను బాగానే ఆడించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు తేడా కొడుతున్నాయి. సోనియా అసలు రంగు ఏంటో బయటపడుతోంది. సోనియా మోసకత్తే అని ఫేక్ అని యష్మీ పదే పదే నిరూపిస్తోంది. మంగళవారం జరిగిన టాస్కులో సోనియా క్లియర్‌గా మోసం చేయడం కనిపించింది.

    బూర కొట్టు.. రేషన్ పట్టు టాస్కులో నిఖిల్, అభయ్ బరిలోకి దిగితే.. సంచాలక్‌గా సోనియాని బిగ్ బాస్ పెట్టాడు. దీంతో సంచాలక్ కాస్త పక్షపాతం చూపించింది. నిఖిల్‌కు ఫేవర్‌గా నిర్ణయాలు తీసుకుంది. తన టీంకు సంబంధించిన బెలూన్స్ మాత్రమే లోపలకి తొస్తూ తెలివిగా ఆడింది సోనియా. అక్కడ సంచాలక్‌గా మళ్లీ ఫెయిల్ అయింది. ఆ చీటింగ్‌‌ను అందరూ గమనించారు. కావాలని ఆరెంజ్ బెలూన్లను మాత్రమే సోనియా లోపలకు నెట్టేస్తోంది.

    ఇక ఈ విషయాన్ని యష్మీ ఎక్స్ పోజ్ చేసింది. సోనియా అసలు రంగుని మరోసారి బయటపెట్టేసింది. తప్పు చేసినా కూడా సిగ్గు లేకుండా సోనియా కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ సోనియా సంచాలక్‌గా ఫెయిల్ అయింది. మరి ఈ విషయం మీద నాగ్ వీకెండ్లో మాట్లాడుతాడో లేదో. అసలే సోనియా బిగ్ బాస్ ముద్దు బిడ్డ అన్న సంగతి తెలిసిందే.