• December 17, 2023

Bigg Boss Winner Pallavi Prashanth గెలిచిన ప్రశాంత్.. యావర్‌కు రూ. 15 లక్షలు

Bigg Boss Winner Pallavi Prashanth గెలిచిన ప్రశాంత్.. యావర్‌కు రూ. 15 లక్షలు

    Bigg Boss 7 Telugu Finale Winner బిగ్ బాస్ ఏడో సీజన్ పూర్తి కావొచ్చింది. ఈ ఆదివారం నాటి ఎపిసోడ్‌తో బిగ్ బాస్ ఏడో సీజన్ పూర్తి కానుంది. ఆల్రెడీ శనివారం నాడు జరిగిన షూటింగ్‌తో విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అన్నది డిసైడ్ అయిపోయింది. ఆరోస్థానంలో అర్జున్, ఐదో స్థానంలో ప్రియాంక.. నాలుగో స్థానంలో పది హేను లక్షల డబ్బుతో యావర్ బయటకు వచ్చారు. మూడో స్థానంలో శివాజీ అవుట్ అయ్యాడు. ఇక రన్నర్‌గా అమర్ దీప్ నిలిచాడు. బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్‌గా రైతు బిడ్డ ప్రశాంత్ నిలిచాడు.

    యావర్ పదిహేను లక్షలు తీసుకోగా.. మిగిలిన 35 లక్షలు ప్రశాంత్‌కు వచ్చాయి. అంతే కాకుండా జోసాలుక్కాస్ నుంచి పదిహేను లక్షల విలువైన బంగారం, మారుతి కారు ఇలా అన్నీ కూడా గెలిచినన ప్రశాంత్‌కే వచ్చాయి. అసలు ఈ సీజన్‌కు శివాజీ విన్నర్ అవుతారని అంతా అనుకున్నారు. శివాజీ ఎంట్రీ ఇవ్వడంతో విన్నర్ అన్నది కన్ఫామ్ అయింది. కానీ మధ్యలో శివాజీ తన ప్రవర్తనతో చేజేతులారా నాశనం చేసుకున్నాడు.

    అస్సలు ఊహించని కంటెస్టెంట్‌గా ప్రశాంత్ పైకి లేచాడు. మొదట్లో రెండు మూడు వారాలు ఉండటమే ఎక్కువ అని అంతా అనుకున్నారు. కానీ రతిక ఎపిసోడ్‌తో మనోడి గ్రాఫ్  పెరిగింది. ఆటల్లో చిరుత పులిలా దూకేయడంతో అందరూ ఫిదా అయ్యే వారు. ఇక పల్లవి ప్రశాంత్ మొదటి నుంచి కూడా రైతు బిడ్డ అనే ట్యాగ్, సెంటిమెంట్‌ను వాడుకుంటూనే వచ్చాడు. అది కూడా బాగానే కలిసి వచ్చింది. ఆటలు ఆడిన ప్రశాంత్.. చివరకు కప్పు కొట్టుకుని వెళ్లాడు.

    కప్పు కొడతాను అంటూ పదే పదే చెప్పిన అమర్ రెండో స్థానంకే పరిమితం అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన అమర్ చివరకు కమెడియన్‌లా మారాడు. బిగ్ బాస్, కంటెస్టెంట్లు అమర్‌ను పిచ్చోడిని చేసేశారు. సిల్లీ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా తన తింగరి తనాన్ని అందరికీ చూపించేశాడు. చివరకు అమర్ మాత్రం రెండో స్థానంతో తనను తక్కువ అంచనా వేసిన వారికి తన సత్తాను చాటుకున్నాడు.

    శివాజీా మూడో స్థానంలోనే ఉండిపోయాడు. యావర్‌కి రియాల్టీ తెలుసు, అర్థం చేసుకున్నాడు. కాబట్టే పదిహేను లక్షల డబ్బుతో బయటకు వచ్చాడని అంతా అనుకుంటూ ఉన్నారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన కంటెస్టెంట్లు ఇంత దూరం రావడం కూడా ఓ అఛ్చీవ్ మెంట్. ఎప్పటిలానే ఓ లేడీ కంటెస్టెంట్ టాప్ 5కే పరిమితం అయింది.