- August 21, 2022
Bigg Boss 6 Telugu షోలో హయ్యస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ ఎవరంటే?

బిగ్ బాస్ ఆరో సీజన్‌కు అంతా రంగం సిద్దమైంది. ఇప్పటికే ప్రోమోలతొ బిగ్ బాస్ టీం హల్చల్ చేస్తోంది. వాటితో ఇంకా హైప్ క్రియేట్ చేసేందుకు సిద్దమైంది. అయితే బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఒక్కొక్కరి పేరు తెర మీదకు వస్తోంది. ఇప్పుడు ఇంకొన్ని పేర్లు తెర మీదకు వచ్చాయి. చలాకీ చంటి, నువ్ నాకు నచ్చావ్ పింకీ (సుదీప), గలాట గీతు, అర్జున్ కళ్యాణ్, టీవీ 9 యాంకర్ ఆరోహి, సింగర్ రేవంత్, బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి, శ్రీ సత్య, దీపిక పిల్లి వంటి వారు అయితే ఇప్పటి వరకు కన్ఫామ్ అయ్యారు.
ఓ కామనర్ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి రానున్నాడు. ఈ అందరిలోనూ చలాకీ చంటికి ఎక్కువ రెమ్యూనరేషన్ ముడుతోందని సమాచారం. మామూలుగా అయితే ఉదయ భాను అందరి కంటే ఎక్కువగా అడుగుతోందని, అందుకే ఆమెను కాస్త హోల్డ్‌లో పెట్టారని తెలుస్తోంది. ఒక వేళ ఉదయ భాను గనుక ఎంట్రీ ఇస్తే.. ఆమెదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అవుతుందట. లేదంటే ఈ కంటెస్టెంట్లలో చలాకీ చంటికే ఎక్కువ ముడుతుందని టాక్. అసలే ఇప్పుడు చలాకి చంటి జబర్దస్త్ షోలో బిజీగా ఉన్నాడు.
మరి మల్లెమాల అగ్రిమెంట్లతో చంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటాడా? అవినాష్ మాదిరిగా ఏమైనా డబ్బులు కట్టాల్సి ఉంటుందా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి సీరియల్ నటి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రలో నటించిన సుదీప కూడా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెడుతోందట. ఇంకా ఎవరెవరు వస్తారు.. ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎన్ని ఉండబోతోన్నాయన్నది చూడాలి. మొత్తానికి ఈ సారి కంటెస్టెంట్లు మాత్రం ఓ మోస్తరుగానే ఉన్నట్టు కనిపిస్తోంది. వీరందరిలోనూ ఎవరు నిలబడతారు? ఎవరు గెలుస్తారన్నది చూడాలి.