- September 4, 2022
Bigg Boss 6 Telugu గ్రాండ్ ప్రోమో.. కంటెస్టెంట్లతో నాగ్ సందడి

Bigg Boss 6 Telugu Grand launch Promo బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఇంకో మూడు గంటల్లో ఈ షోను గ్రాండ్‌గా ప్రారంభించబోతోన్నారు. అయితే ఇది వరకే ఈ షోకు సంబంధించిన ఎన్నో లీకులు బయటకు వచ్చాయి. ఆరో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు అన్నీ కూడా లీక్ అవుతూ వచ్చాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ కొంత మంది కంటెస్టెంట్లకు సంబంధించిన హింట్లు ఇచ్చారు.
బిగ్ బాస్ ఇంట్లోకి జబర్దస్త్ ఫైమా, నటుడు రాజశేఖర్, ఇస్మార్ట్ అంజలి అలియాస్ ఆరోహి, ఆదిరెడ్డి, శాని, మెరీనా రోహిత్, శ్రీహాన్, శ్రీ సత్య, కీర్తి భట్, చలాకీ చంటి, అర్జున్ కళ్యాణ్, గలాట గీతూ, వాసంతి, ఇనయ, ఆర్జే సూర్య, సింగర్ రేవంత్, అభినయ, సుదీప, బాలాదిత్య, నేహా ఇలా 20 మంది ఇంట్లోకి వెళ్లే చాన్సులున్నాయి.
ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సింగర్ రేవంత్‌ను ఆట పట్టించినట్టు కనిపిస్తోంది. చలాకీ చంటి డైలాగ్ అదిరింది. మెరీనా రోహిత్ జోడికి సంబంధించిన పర్ఫామెన్స్ కనిపిస్తోంది. మాస్టారు అని పిలుస్తాను అని ఓ కంటెస్టెంట్ అడిగితే.. మా కి స్టార్‌కి.. గ్యాప్ ఇవ్వు అని నాగార్జున అంటాడు. అలా ఈ ప్రోమోలో నాగార్జున తన కంటెస్టెంట్లతో ఎంతో సరదాగా ఉన్నాడు.