• August 20, 2022

Bigg Boss 6 Telugu సందడి షురూ.. పూర్తి వివరాలు ఇవే

Bigg Boss 6 Telugu సందడి షురూ.. పూర్తి వివరాలు ఇవే

    Bigg Boss 6 Telugu గ్ బాస్ తెలుగు ఆరో సీజన్ సందడి మొదలు కాబోతోంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రోమోలతో బిగ్ బాస్ టీం తెగ సందడి చేస్తోంది. కంటెస్టెంట్ల లిస్ట్ కూడా వైరల్ అవుతోంది. కొందరి పేర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎవరెవరు పాల్గొంటారనే విషయం క్లారిటీ అయితే రాలేదు. కానీ కొంత మంది పేర్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ప్రతీ సారి ఇది జరిగే తంతే. అయినా కూడా కొంత మంది సెలెబ్రిటీలు లీకుల వల్ల వెలుగులోకి వస్తుంటారు.

    వారు బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే.. అలా బిగ్ బాస్ జాబితాలో ఉన్నారంటూ వచ్చే రూమర్లతోనే ఎక్కువగా వైరల్ అవుతుంటారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో వినిపిస్తోన్న పేర్లలో క్రేజీ పేరు మాత్రం ఉదయభాను. ఆమె వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే.. ఉదయ భానుకు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక వేళ ఆమె వస్తే.. ఆమె మాత్రమే హైలెట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక జబర్దస్త్ షోలో ఫేమస్ అయిన అప్పారావు, చలాకీ చంటిలు కూడా ఉండే అవకాశం కనిపిస్తోందట.

    అయితే అప్పారావు అనే వ్యక్తి స్టార్ మాలో ఎన్నో షోలు చేశాడు. కాబట్టి అతడిని తీసుకునే చాన్స్ ఉంది. సింగర్ రేవంత్ కూడా ఈ సారి రాబోతోన్నాట. ఇక టీవీ 9 యాంకర్ ఇస్మార్ట్ అంజలి అలియాస్ ఆరోహి కూడా ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టబోతోన్నాడట. సత్య శ్రీ, యూట్యూబర్ అర్జున్ కళ్యాణ్ వంటి వారంతా కూడా ఈ సారి సందడి చేయబోతోన్నట్టు తెలుస్తోంది. బుల్లితెర తారలు, వెండితెర నాటి హీరో హీరోయిన్లలో ఎవరెవరు వస్తారో చూడాలి. ఆర్జీవీ భామల్లోంచి ఇనయా సుల్తానా కూడా ఉండబోతోన్నట్టు సమాచారం అందుతోంది.