- October 23, 2021
Bigg Boss 5 Telugu : సన్నీ అభిమానుల గెలుపు ఇది.. ప్రియ అవుట్!

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతోందో క్షణాల్లోనే బయటకు వస్తుంటుంది. అదే లీకుల వీరుల గొప్పదనం. అలా అక్కడ షూటింగ్ జరగడం ఆలస్యం ఇక్కడ బయటకు వచ్చేస్తుంటుంది. అయితే ప్రతీవారం ఎలిమినేషన్ ఆదివారం జరిగినా.. దానికి సంబంధించిన లీకులు మాత్రం శనివారమే వస్తుంటాయి. ఎందుకంటే ఆదివారం వచ్చే ఎపిసోడ్ షూటింగ్ సైతం శనివారమే జరుగుతుంది కాబట్టి. అలా శనివారం రాత్రి వరకు షూటింగ్ జరుగుతుంది. అందుకే లీకులు అలా బయటకు వచ్చేస్తుంటాయి.
తాజాగా ఏడో వారం ఎలిమినేషన్ వేటు ఎవరి మీద పడిందో తెలిసిపోయింది. ప్రియ ఆంటీ బయటకు వచ్చేసింది. అలా ప్రియా ఆంటీ ఎలిమినేట్ అవ్వడంతో కొంతమంది సంబరాలు చేసుకుంటూ ఉంటే.. ఇంకొంత మంది మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. అయితే ప్రియ ఎలిమినేషన్ మాత్రం తన స్వయంకృతాపరాధమే. ప్రతీసారి సన్నీని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతోనే ప్రియ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. చెంప పగలగొడతాను అని పదే పదే అనడంతో సన్నీ అభిమానులు బయటి నుంచి అదే చేసి చూపించారు.
ఓట్లు సన్నీకే గుద్ది ప్రియను ఎలిమినేట్ చేసేశారు. అలా మొత్తానికి ఈ వారం టాస్కులో ప్రియ చేసిన తప్పులే ఆమె ఎలిమినేషన్‌కు కారణమయ్యాయి. దీంతో ప్రియ బయటకు రావాల్సి వచ్చిందని తెలుస్తోంది. అసలే సన్నీ, ప్రియ మధ్య గొడవలు సద్దుమణి ఇప్పుడిప్పుడు కొత్త ట్రాక్ ఏర్పడే తరుణంలో ఇలా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. కన్నుకొట్టడం, ముద్దులు విసరడం వంటివి చేసినా కూడా ప్రియను కాపాడలేకపోయింది. మొత్తానికి ప్రియ బిగ్ బాస్ ఇంటి నుంచి నిష్క్రమించినట్టు తెలుస్తోంది. అసలు కథ తెలియాలంటే.. ప్రియ ఎలిమినేషన్ ఏమైందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఆగాల్సిందే.