• March 20, 2022

Bheemla Nayak హిట్.. రాధే శ్యామ్ డిజాస్టర్

Bheemla Nayak హిట్.. రాధే శ్యామ్ డిజాస్టర్

    Radhe Shyam పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా తెలుగునాట బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నార్త్‌లో డబ్ చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక రాధే శ్యామ్ సినిమా పరిస్థితి ఇంటాబయటా దారుణంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాధే శ్యామ్ కలెక్షన్ల పరంగా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇక ఉత్తరాదిన అయితే డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇంకా కలెక్షన్ల పరంగా పుంజుకునే స్థితిలో అస్సలే లేదు.

    ఉత్తరాదిన ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ సినిమా ముందు ప్రభాస్ ఇమేజ్ గానీ, రాధే శ్యామ్ సినిమా గానీ నిలబడలేకపోతోంది. రాధే శ్యామ్ సినిమా బాలీవుడ్‌లో బోల్తా కొట్టేసింది. భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్లలో దుమ్ములేపగా.. రాధే శ్యామ్ మాత్రం చప్పున చల్లబడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వంద కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. కానీ దాన్ని కూడా రికవరీ చేయలేకపోయింది.

    ఇక హిందీలోనూ రాధే శ్యామ్ పరిస్థితి అంతే ఉంది. వంద కోట్లు కొల్లగొడుతుందని ఆశపడితే.. కనీసం 20 కోట్లు కూడా రాబట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఓవర్సీస్‌లోనూ రాధే శ్యామ్ దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంటోంది. మొత్తానికి ప్రభాస్ స్థాయికి తగ్గ సినిమా కాదని, కథలో దమ్ములేదని అందరికీ అర్థమైంది.

    అదే సమయంలో భీమ్లా నాయక్ సినిమా తెలుగు నాట బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నిర్మాతలకు లాభాల పంట పండించింది. మొత్తానికి భీమ్లా నాయక్ నిర్మాతలు సేఫ్ జోన్‌లోనే పడ్డారు. అయితే రాధే శ్యామ్ నిర్మాతలు సైతం ఓటీటీ, డిజిటల్ హక్కుల పేరిట ముందే సేఫ్ జోన్‌లో పడ్డారని తెలుస్తోంది.

    Leave a Reply