- November 14, 2021
బండ్లన్న మంచి మనసుకు నిదర్శనమిదే!

బండ్ల గణేష్ ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సినిమా సంగతులు పక్కన పెడితే.. సమాజంలోని సమస్యలపై స్పందిస్తాడు.ఎవరైనా ఏదైనా సాయం కావాలని అడిగితే వెంటనే ఆపద్భాంధవుడు అయిపోతాడు.. చేతనైన సాయంచేస్తాడు. లేదా ఆ సాయం చేయించేలా ప్రయత్నిస్తాడు. అలా బండ్ల గణేష్ లాక్డౌన్ సమయంలో ఎంతో మందికి డబ్బు సాయం చేశాడు. ఎంతో మందికి అన్నం పెట్టాడు. ఉద్యోగం ఇప్పించాడు. వైద్యానికి సాయం చేశాడు.
బండ్ల గణేష్‌ను ట్విట్టర్‌లో కోరడం ఆలస్యం.. ఇలా వెంటనే స్పందిస్తాడు. అవసరమైన సాయం చేస్తాడు.తన వల్ల కానిది ఏదైనా ఉంటే.. వెంటనే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాడు. మొత్తానికి అవతలి వారిని మాత్రం నిరాశపర్చడు. అలాంటి తాజాగా ఓ నెటిజన్ బండ్ల గణేష్‌ను సాయాన్ని అర్థించాడు. తన అక్క కూతురికి నిత్యం ఫిట్స్ వస్తుందని, రెయిన్ బో హాస్పిటల్‌లో ఉందని.. దయచేసి సాయం చేయండి అని కేటీఆర్, సోనూ సూద్, బండ్ల గణేష్‌ను కోరాడు.
వెంటనే బండ్ల గణేష్ స్పందించాడు. కేటీఆర్‌ను వేడుకున్నాడు. దయచేసి సాయం చేయండి సర్ అని కేటీఆర్‌కు ట్వీట్ వేశాడు. దీంతో వెంటనే కేటీఆర్ నుంచి స్పందన వచ్చింది. సదరు నెటిజన్ అడిగిన సాయం అందింది. బండ్ల గణేష్ మంచితనానికి, మంచి మనసుకు ఇదొక నిదర్శనం మాత్రమే. ఇలాంటివి ఎన్నెన్నో బండ్ల గణేష్ చేశాడు. అందరి మనసులను దోచుకున్నాడు. అందుకే బండ్లన్నకు సోషల్ మీడియాలో ఇంతటి క్రేజ్.