- January 11, 2022
వైసీపీ నేతలకి బండ్ల గణేష్ కౌంటర్

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. కోవూరు ఎమ్మెల్యేనేమో నిర్మాతలు బలిసిన వాళ్లు అని కామెంట్ చేస్తాడు. ఇక మరో నేత అయితే ఏకంగా ఇండస్ట్రీకి కులాన్ని అంటగట్టేశాడు. వైసీపీ నేత రవిచంద్రారెడ్డి టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ పుష్ప సినిమాలో ముగ్గురు అన్నదమ్ములను విలన్లుగా చూపించారని, వీరి పేర్లు కొండారెడ్డి, జక్కా రెడ్డి, జాలి రెడ్డి అని, కావాలనే విలన్లకు ఇలా రెడ్డి పేర్లను పెట్టారని మండిపడ్డారు.
అయితే వీటికి బండ్ల గణేష్ తన స్టైల్లో కౌంటర్లు వేశారు. రెడ్డి వర్గానికి టాలీవుడ్ వ్యతిరేకం అనుకుంటే.. సమరసింహారెడ్డి, ఇంద్ర సేనా రెడ్డి, సైరా నరసింహారెడ్డి చిత్రాలు ఎలా తీశారు.. రెడ్డి వర్గం హీరోయిజాన్ని ఎందుకు చూపించారంటూ చురకలు అంటించారు. దీంతో బండ్ల గణేష్ ఇచ్చిన కౌంటర్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
బాలకృష్ణ సమరసింహా రెడ్డి అన్న సినిమా తీశారని అందులో నటించిన హీరో బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేరు పెట్టి హీరోయిజం ఎలివేట్ చేశారని బండ్ల గణేష్ సెటైర్ వేశారు.
అదేవిధంగా చిరంజీవి ఇంద్ర సినిమాలో ఇంద్రసేనారెడ్డి పాత్ర పోషించారని నిర్మాత అశ్వినీదత్ కమ్మ సామాజిక వర్గం చిరంజీవి కాపు సామాజిక వర్గం అయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేరు పెట్టారని నొక్కి చెప్పారు. అంతేకాకుండా సైరా నరసింహారెడ్డి పేరుతో చిరంజీవి సినిమా తీసినప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలకు ఇవన్నీ గుర్తు రాలేదా వైసీపీ నేతలకు చురకలు అంటించారు.