- September 23, 2022
వినూత్నమైన రీతిలో ‘బలమెవ్వడు’ ట్రైలర్ లాంచ్, అక్టోబర్ 1 న గ్రాండ్ రిలీజ్
సనాతన దృశ్యాలు పతాకంపై ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘బలమెవ్వడు’. వైవిద్య భరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు ఫృథ్విరాజ్, సుహాసిని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి విడుదలైన టీజర్, మరకతమణి ఎం.ఎం.కీరవాణి పాడిన టైటిల్ సాంగ్.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ వినూత్నమైన రీతిలో ‘బలమెవ్వడు’ ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
సీనియర్ నటుడు పృథ్వి మాట్లాడుతూ.. మెడికల్ మాఫియా ఒక కామన్ మ్యాన్ ను ఎంత నలిపేస్తుంది.. దాన్ని ఎలా ఎదు ర్కోవాలో అన్న పాయింట్ తో చాలా ఇంట్రెస్ట్ తో వస్తున్న ఈ సినిమాను దర్శక, నిర్మాతలు చాలా కష్టపడి తియ్యడం జరిగింది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి సినిమాలకు అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమాకోసం నేను పది రోజుల్లో పది కేజిలు తగ్గాను. మా సినిమాను ప్రేక్షకులందరూ అదరిస్తే మా చిత్ర యూనిట్ కు బలం చేకూరుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు సత్య రాచకొండ మాట్లాడుతూ.. మెడికల్ మాఫియా కథ తో మొదలు పెట్టిన మాకు కోవిడ్ రావడంతో మాకు సపోర్ట్ గా నిలిచిన నిర్మాతలు వెనక్కి వెళ్లడంతో మేము చాలా ఇబ్బంది పడ్డాము . దాంతో మా అమ్మ, నాన్న నా సినిమా ఆగిపోకూడదని ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి నాకు సపోర్ట్ గా నిలిచి సినిమాను పూర్తి చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. మెసేజ్ తో పాటు ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన ప్రేమ కథ, సున్నితమైన హాస్యం కలగలపి తీసిన ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా చిత్రీకరించడం జరిగింది. మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ వలన థియేటర్స్ కు వచ్చిన ప్రేక్షకులకు పెద్ద సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. సుహాసిని గారు రాఖీ సినిమా తర్వాత అంత పవర్ ఫుల్ రోల్ మా సినిమాలో చేయడం చాలా గర్వంగా ఉంది. పృథ్వి గారితో పాటు హీరో హీరోయిన్ లకు అవార్డు వస్తుందనే నమ్మకం కలిగింది. హీరో ధ్రువన్ అన్ని పనుల్లో మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. సినిమా అనేదే కొంతమందికి జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే.. కానీ ప్రేక్షకులు కొనే టికెట్ విలువ ఎంతో మందికి ఎంప్లాయ్ మెంట్ ఇస్తుంది. మంచి కంటెంట్ తో అక్టోబర్ 1న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర హీరో ధ్రువన్ కటకం మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ అందరికీ నార్మల్ డే కానీ మాకు లైఫ్ టర్నింగ్ డే .ఇది నామొదటి చిత్రం. ప్రతి ఒక్కరికీ లైఫ్ లో మొదటి సారి చేసే పని చాలా ఇంపార్టెంట్. అలాగే మాకు ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా ట్రైలర్, టీజర్, పోస్టర్స్ నచ్చితే ఎప్పుడో ఓటిటి లో వస్తుంది కదా అని కాకుండా మంచి కంటెంట్ తో వస్తున్న మా సినిమాను థియేటర్ కు వచ్చి చూడండి అని కోరుకుంటున్నాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ మీరు మిడిల్ క్లాస్ లో ఉంటూ లైఫ్ లో రిస్క్స్ తీసుకోకూడదు అనుకుంటున్నారా అయితే ఈ సినిమా చూడండి అన్నారు.
హీరోయిన్ నియా త్రిపాటి.. ఇది నా మొదటి చిత్రం. ఇందులో నేను పరిణిక క్యారెక్టర్ లో నటిస్తున్నాను. సీనియర్ యాక్టర్ పృథ్వీ తో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధ్రువన్ చాలా బాగా నాటించాడు. మెడికల్ మాఫియా వంటి మంచి కథ ఉన్న ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
ఇంకా ఈ చిత్రంలో పాల్గొన్న వారందరూ అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.
నటీ నటులు:
ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, పృద్వి రాజ్, నాజర్, సుహాసిని మణి రత్నం, శ్రావణ్ భరత్, మోహన్ కాంత్, జబర్దస్త్ అప్పారావు, మణి మహేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : సనాతన దృశ్యాలు
నిర్మాత : ఆర్. బి. మార్కండేయలు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం : సత్య రాచకొండ సంగీతం : మణిశర్మ
డి. ఓ. పి : సంతోష్, గిరి
ఎడిటర్ : జస్విన్ ప్రభు
లిరిక్స్ : కళ్యాణ్ చక్రవర్తి
గాయకులు : ఎం. ఎం. కీరవాణి, అనురాగ్ కులకర్ణి
పి. ఆర్. ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు