• July 10, 2023

Hero Viraj: బేబీ తో హిట్టు కొట్టబోతోన్న విరాజ్ అశ్విన్

Hero Viraj: బేబీ తో హిట్టు కొట్టబోతోన్న విరాజ్ అశ్విన్

    Hero Viraj: అనగనగా ఓ ప్రేమ కథతో అరంగేట్రం చేశాడు యంగ్ హీరో విరాజ్ అశ్విన్. తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించిన విరాజ్‌కు.. థ్యాంక్యూ బ్రదర్‌తో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఏర్పడింది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. విరాజ్ తన షార్ట్ ఫిల్మ్ “మనసనమహ”తో ఓ సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఈ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్ (513 అవార్డులు)గా గిన్నిస్ రికార్డ్ సాధించింది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడే విరాజ్ అశ్విన్. తాజాగా హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి బేబీ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

    సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ మూవీ ఈ నెల 14న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని విరాజ్ అశ్విన్ భావిస్తున్నాడు. ట్రైలర్‌లో లవర్ బాయ్ తరహా పాత్రలో మెప్పించాడు. స్క్రీన్ ప్రజెన్స్ కూడా అదిరిపోయింది. పాటల్లోనూ అద్భుతంగా నటించాడు. ట్రైలర్ లాంచ్‌లో “చాక్లెట్ బాయ్ లుక్స్” అని విరాజ్ అశ్విన్‌ను చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ ప్రశంసించారు.

    బేబీ ట్రైలర్‌ను చూస్తుంటే.. విరాజ్‌ అశ్విన్ పాత్ర చాలా కీలకమైనదిగా అర్థమవుతోంది. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయితేమరి కొన్ని క్రేజీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మేలో మాయపేటికతో ఆడియన్స్ ముందుకు రాగా.. ప్రస్తుతం బేబీతో పాటు మరో మూడు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విరాజ్ అశ్విన్ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు.