- January 9, 2022
Project K : ఇక ప్రభాస్ హాలీవుడ్ సినిమాలే.. అంచనాలు పెంచిన అశ్వనీదత్

ప్రభాస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాలతో వచ్చిన క్రేజ్‌ను సాహోతో నిలబెట్టుకున్నాడు. అది ఉత్తరాదిన ఎంత మ్యాజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఏ సినిమా చేసినా జాతీయం లేదా అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుంది. ప్రభాస్ చేతి నిండా ప్రాజెక్ట్‌లున్నాయి. రాధేశ్యామ్ విడుదలకు రెడీగా ఉంది.
సలార్, ఆదిపురుష్ షూటింగ్ దశల్లో ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ కే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక స్పిరిట్ సినిమా అయితే కేవలం అనౌన్స్మెంట్ వరకే ఉంది. అయితే మైత్రీ మూవీస్ బ్యానర్‌లో మరో సినిమా ఉండబోతోందని తెలిసిందే. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూమర్లు నెట్టింట్లో చక్కర్లుకొట్టేస్తున్నాయి. ఆ సినిమాకు చాలా భాగం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తోంది.
తాజాగా అశ్వనీదత్ ప్రాజెక్ట్ కే గురించి కొన్ని విశేషాలు చెప్పుకొచ్చాడు. హాలీవుడ్ ఆర్టిస్ట్‌లు, హాలీవుడ్ డైరెక్టర్లు ఎంక్వైరీ చేస్తున్న ఏకైక నటుడు ప్రభాస్.. ప్రాజెక్ట్ కే సినిమా తరువాత ప్రభాస్ ఇక అన్ని ఇంగ్లీష్ సినిమాలే చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ సినిమాకు అంత పొటెన్షియాలిటీ ఉంది. ప్రభాస్‌కు పదింతల పొటెన్షియాలిటీ ఉంది.
ప్రభాస్‌కు అంత స్టామినా ఉంది కాబట్టే.. నాగి రెండున్నరేళ్లు కష్టపడి కథ రాశాడు. ఇందులో అమితాబ్, దీపికా పదుకొణె వంటి భారీ తారాగణం ఉంది. హై ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యుల్స్ అయిపోయాయి. ఈ జనవరి 28 నుంచి మరో షెడ్యుల్ ఉంది. సెట్స్ వర్క్ జరుగుతోంది. అయితే ఒమిక్రాన్ ఎలా ఉంటుందో తెలీదు, ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2023 ప్రథమార్థం చివర్లో అంటే మే, ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.