• August 17, 2022

Sita Ramam బడ్జెట్ ఎంతంటే?.. అలా మొదలైన కల్ట్ క్లాసిక్

Sita Ramam బడ్జెట్ ఎంతంటే?.. అలా మొదలైన కల్ట్ క్లాసిక్

    సీతారామం సినిమా ఇప్పుడు ఓ కల్ట్ క్లాసిక్ చిత్రం. సీతారామం సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాల్సిందే. ఆసినిమా ట్రాన్స్‌లోనే ఉంటారు. సీతారామం సినిమాతో, రామ్ సీత పాత్రలతో అందరూ ట్రావెల్ అవుతారు. సీతారామం సినిమా ఎప్పటికీ నిలిచిపోయే ఓ చిత్రమని అందరూ కొనియాడుతున్నారు. దుల్కర్, మృణాళ్ పోషించిన పాత్రలు, నటించిన తీరు, హను రాఘవపూడి టేకింగ్, విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇవన్నీ కూడా జనాలను వెంటాడుతూనే ఉంటాయి.

    అలాంటి సీతారామం సినిమా నాగ్ అశ్విన్ చెప్పిన ఒక్క మాటతో ముందుకు కదిలింది. హను రాఘవపూడి ఓ మంచి టెక్నీషియన్, అతను సినిమాను అద్భుతంగా తీస్తాడు.. మన బ్యానర్‌లో సినిమాలు తీయగల దర్శకుడు అంటూ నాగ్ అశ్విన్ రిఫర్ చేశాడట. అలా ముందు హను రాఘవపూడి చెప్పిన కథను.. స్వప్నా విన్నదట. ఆ తరువాత అశ్వనీదత్ విన్నారట. కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. ఇంటర్వెల్, క్లైమాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టినా పర్వలేదని అనుకున్నట్టుగా అశ్వనీదత్ తెలిపాడు.

    అసలే తాను ప్రేమకథను తీయలేదని, ఇలాంటి ఓ చిత్రాన్ని నిర్మించాలని ఎప్పటి నుంచో తాను అనుకున్నాడట. ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు పెట్టామని అంతా అన్నారు.. మాకు కూడా అనిపించింది. ఈ సినిమాకు యాభై కోట్లు పెట్టినా కూడా మేం సంతృప్తి చెందామని అశ్వనీదత్ అన్నాడు. ఈ చిత్రం మాకు ఇంకో యాభై ఏళ్ల వరకు నిలబెట్టేసిందని గొప్పగా చెప్పేశాడు. ఎంత పవిత్రంగా, స్వచ్చంగా సినిమాను ఎలా తీశారని అందరూ అంటున్నారు అని సీతారామం గురించి అశ్వనీదత్ చెప్పుకొచ్చాడు.