• August 30, 2023

Chiranjeevi-The Family Man : ఫ్యామిలీ మెన్ కథను వద్దన్న చిరు.. ఇదేం నిర్ణయం బాసూ

Chiranjeevi-The Family Man : ఫ్యామిలీ మెన్ కథను వద్దన్న చిరు.. ఇదేం నిర్ణయం బాసూ

    Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఇప్పుడు ఎలా ట్రోలింగ్‌కు గురవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు చిరంజీవి జడ్జ్ మెంట్‌కు ఎంతో వ్యాల్యూ ఉండేది. సినిమా హిట్టు అంటే హిట్టు అయ్యేది.. ఎంతో మందికి స్క్రిప్ట్ సెలెక్షన్లలో స్పూర్తిలా ఉండేవాడు. కానీ ఇప్పుడు చిరంజీవి నిర్ణయాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. తాజాగా అశ్వనీదత్ చెప్పిన విషయాలు అందరినీ బాధపెడుతున్నాయి.

    రాజ్ అండ్ డీకే ముందుగా ఫ్యామిలీ మెన్ స్టోరీని చిరంజీవికి చెప్పారట. చిరంజీవితో సినిమా తీయాలని అనుకున్నారట. ఆ ప్రాజెక్టును అశ్వనీదత్ సెట్ చేయాలని అనుకున్నాడట. కానీ చిరు మాత్రం వద్దని అన్నాడట. ఇప్పుడు 150 సినిమా వచ్చింది.. మళ్లీ ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రిగా అంటే వద్దు అని అన్నాడట.. కావాలంటే ఆ పిల్లల కాన్సెప్ట్ లేకుండా చేస్తామని అన్నారట. కానీ చిరు మాత్రం నిర్మొహమాటంగా వద్దని అన్నాడట.

    కట్ చేస్తే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్లిక్ అయింది. రాజ్ అండ్ డీకేలు హాట్ ఫేవరేట్లు అయ్యారు. కానీ చిరంజీవి మాత్రం ఇంకా నాసిరకం కథలు ఎంచుకుంటూ పాతాళంలోకి వెళ్తున్నాడు. ఆచార్య, గాడ్ ఫాదర్‌లు, భోళా శంకర్‌లు అంటే ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ఫ్యామిలీ మెన్ కథను తిరస్కరించడంతో మెగా ఫ్యాన్స్ తెగ హర్ట్ అవుతున్నారు. అలాంటి కథను ఎందుకు వద్దన్నావ్ బాసూ అని బాధపడుతున్నారు. ఆయన రిజెక్ట్ చేయడం వల్లే ఆ వెబ్ సిరీస్ అంత బాగా వచ్చింది.. మంచిది అయింది.. ఒప్పుకుంటే దారుణంగా ఉండేది అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.