• October 26, 2021

గాయాలపాలైన అరియానా, అఖిల్.. అంతా దాని వల్లే!

గాయాలపాలైన అరియానా, అఖిల్.. అంతా దాని వల్లే!

    బిగ్ బాస్ షో ద్వారా అరియానా, అఖిల్, సోహెల్, మెహబూబ్ వంటి వారు ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఈ నలుగురిలో అఖిల్, సోహెల్ ఎప్పటి నుంచి టీవీ రంగంలోనే ఉన్నారు. కానీ వారికి సరైన గుర్తింపు రాలేదు. ఇక అరియానా, మెహబూబ్‌లో సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయి ఉన్నారు. కానీ బిగ్ బాస్ తరువాత వారి ఇమేజ్ మొత్తంగా మారిపోయింది. ఇప్పుడు ఈ నలుగురు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నారు.

    మొన్నీ మధ్యే మెహబూబ్ కొత్తింటికి షిఫ్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. సొంతింటి కల నెరవేరిందని, చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నానని మెహబూబ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక అరియానా, అఖిల్ మొన్నీ మధ్య జీ తెలుగు కుటుంబం అవార్డుల్లో కనిపించారు. మొదటిసారిగా అఖిల్ స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయడం కాకుండా హోస్టింగ్ కూడా చేశాడు. అంతే కాకుండా అరియానా, అఖిల్ కలిసి సాహసం చేశారు.

    ఏరియల్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేశారు. తాళ్లు కట్టుకుని కిందా మీద వేళ్లాడారు. అది చాలా ఈజీ అన్నట్టుగా ఎంతో మంది ఎన్నో కామెంట్లు చేశారు. కానీఅదెంత కష్టమో తాజాగా చూపించారు అరియానా, అఖిల్. ఈ దెబ్బకు అందరూ నోర్మూసుకున్నారు. తాళ్లతో డ్యాన్స్ చేయడం అంత ఈజీ కాదని చెప్పకనే చెప్పేశారు.

    ఏరియల్ షాట్స్, యాక్షన్స్‌తో డ్యాన్స్ చేయడం అంటే ఆషా మాషీ కాదని చెప్పేశారు. తాళ్లు కట్టుకుని డ్యాన్స్ చేయడంతో వారి చేతులు, జబ్బలు కమిలిపోయాయి. రక్తాలు కారినట్టుగా ఎర్రగా అయిపోయాయి. అయినా కూడా తమకు ఎంతో ఆనందంగా ఉందని, కష్టపడితేనే ఫలితం వస్తుందని అన్నారు.

    Leave a Reply