• September 5, 2025

అనుష్క ఘాటీ ట్విట్టర్ రివ్యూ.. పోయినట్టుందే

అనుష్క ఘాటీ ట్విట్టర్ రివ్యూ.. పోయినట్టుందే

    Anushka Ghaati Twitter Review అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కించిన చిత్రం ఘాటీ. యూవీ క్రియేషన్స్ ఈ మూవీకి తెరకెక్కించిన బ్యానర్లలో ఒకటి. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌కి స్వీటీ వచ్చి ఉంటే ఇంకోలా ఉండేదేమో. పూర్ ప్రమోషన్స్‌తో ఘాటీ అసలు జనాల్లోకి ఎక్కువగా వెళ్లలేదు. అయితే టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్‌లకు అంతో ఇంతో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దీంతో ఘాటీ మీద సోషల్ మీడియాలో కొంత టాక్ అయితే నడుస్తోంది.

    ఘాటీకి సంబంధించిన టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫస్ట్ మరీ బిలో యావరేజ్‌గా ఉందట.. ఇదొక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా ఉంటుందట. కానీ ఎక్కడా కూడా జనాల్ని కన్విన్స్ చేయలేదట. ఓ కన్విక్షన్ అనేది ఉండదట. ఈస్ట్రన్ ఘాట్స్‌లో ఈ కథ జరుగుతున్నట్టుగా చూపించాడట. పుష్ప, దసరా లెవెల్లో సెటప్ చేసుకున్నాడట. కానీ కథను మాత్రం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడట.

    అంతో ఇంతో కొన్ని చోట్ల యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగానే ఉన్నాయట. కానీ వాటి విజువల్స్ కూడా సరిగ్గా లేవట. ఎన్నో సార్లు.. ఎక్కడో చూసినట్టుగానే కథ, కథనాలు సాగుతూ ఉంటాయట. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదని అంటున్నారు. క్రిష్ నుంచి సరైన సినిమా రాలేదన్న ఫీలింగ్ కలుగుతుందట. ఇదొక వండీ వండని.. మధ్యలో వదిలేసిన వంటలానే ఉంటుందట.