- July 23, 2022
Anupama Parameswaran: “బ్యూటిఫుల్ గర్ల్” ఫస్ట్ లుక్ విడియో పోస్టర్ ను లాంచ్ చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై వస్తున్న తాజా చిత్రం ” ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ “. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బ్యూటిఫుల్ గర్ల్ ” చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..ఈ రోజు మొదటి సారిగా “బ్యూటిఫుల్ గర్ల్” సినిమా ఫస్ట్ లుక్ విడియో పోస్టర్ ను లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ బ్యానర్ లో నేను అందమైన సినిమా “బటర్ ఫ్లై” సినిమాలో నటించాను. ఇది నాకు మంచి పేరు తీసుకువస్తుంది. ఈ సినిమా త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మీరందరూ చూడవచ్చు. సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న ఈ బ్యానర్. మరొక మంచి కథను సెలెక్ట్ చేసుకొని చేస్తున్న “బ్యూటిఫుల్ గర్ల్” సినిమా ఫస్ట్ లుక్ బాగుంది.ఈ సినిమాకు అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. బటర్ ఫ్లై లో నా కో స్టార్ నిహాల్ ఈ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాలో చాలా చక్కగా నటించాడు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
చిత్ర దర్శకుడు రవి ప్రకాష్ బోడపాటి మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన అనుపమ గారికి ధన్యవాదములు.
నాకు చిన్నప్పిటి నుండి స్టార్ అవ్వాలనే కోరిక ఉండేది.కానీ స్టార్ అవ్వాలంటే చాలా కష్టం అని తరువాత తెలిసింది.ఆ తరువాత నేను జన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ ను స్థాపించి ఈ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా 2007 లో మంత్ర సినిమా చేశాము,అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఆ తరువాత కొన్ని కారణాల వలన కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రొడక్షన్ నెంబర్ 2 గా అనుపమ పరమేశ్వరన్ తో “బటర్ ఫ్లై” సినిమా తీశాము.దానికి మాకు మంచి పేరు వస్తుంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ “బటర్ ఫ్లై” సినిమాను చూసిన వారంతా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆ తరువాత మంచి ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్ “బ్యూటిఫుల్ గర్ల్”.ఈ సినిమాకు నేను స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చేశాను.సంగీత దర్శకుడు అర్వీజ్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. గిడియన్ కట్టా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ని వేరే లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఇందులో వర్క్ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ కొత్త వారైనా చాలా హార్డ్ వర్క్ చేశారు. జగడం, ఎవరు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న నిహాల్ కొదాటి హీరోగా రవి పాత్రలో ఫుల్ ఎనర్జీ తో వర్క్ చేశాడు..ఇండస్ట్రీ కి ఫ్యూచర్ లో కచ్చితంగా డిమాండింగ్ హీరో ఆవుతాడనే నమ్మకం ఉంది.గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లలో ఎక్కిన “మనసా నమః” షాట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా నటించిన దృషికా చందర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా హీరో హీరోయిన్ లు ఇద్దరూ అద్భుతంగా నటించారు. విక్రమ్ గా నటించిన సమర్ద్, మధు నందన్, దేవి నాగవల్లి, భార్గవ్ పోలుదాస్ ఇలా అందరూ బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా లిమిటెడ్ బడ్జెట్ లో చేసాము. ఈ జన్ నెక్స్ట్ నుండి ఇకనుండి ప్రేక్షకులకు మంచి మంచి సినిమాలు అందిస్తాము అన్నారు
చిత్ర నిర్మాత ప్రసాద్ తిరువల్లూరి మాట్లాడుతూ..మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి వచ్చిన అనుపమ గారికి థాంక్స్ చెప్పాలి.నేను ఇంతకుముందు సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో వర్క్ చేశాను. పుష్యమి దవళేశ్వరపు, అనిల్, క్రాంతి జువ్వల మేమంతా కలసి ఈ చిత్రం చేసాము 2007 మంత్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన రచయిత, నిర్మాత రవిప్రకాష్ బోడపాటి రాసుకున్న కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాము.తనే ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నాడు. రామ్ నటించిన జగడం మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రామ్ కు తమ్ముడుగా నటించిన నిహాల్ ఇందులో హీరోగా చేస్తున్నాడు.అరుంధతి సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్ గా వర్క్ చేసి నంది అవార్డ్స్ అందుకొన్న దీపాచందర్ కూతురు ద్రిషిక చందర్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశాము. ఈ అమ్మాయి “మనసా నమః” షార్ట్ ఫిల్మ్ లో నటించింది. దానికి 400 పైన అవార్డ్స్ వచ్చాయి.ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ కొత్తవారైనా చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము అని అన్నారు.
హీరో నిహాల్ కోదాటి మాట్లాడుతూ.. అనుపమ గారు వచ్చి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు అందరం చాలా హార్డ్ వర్క్ చేశాము.నా కో స్టార్ ద్రిషిక చందర్ చాలా బాగా సపోర్ట్ చేసింది.అమర్ దీప్ నాకు 5 ఇయర్స్ నుండి తెలుసు తను ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. తనతో ఇంకొక మూవీ చేస్తున్నాము.”మంత్ర” వంటి కల్ట్ ఫిల్మ్ తీసిన తరువాత మంచి కథతో తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్ర నిర్మాతలు,దర్శకులు రవి ప్రకాష్ సీన్ బాగా రావాలని ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుంది.
హీరోయిన్ దృశిక చందర్ మాట్లాడుతూ.. నిహాల్ తో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.దర్శక,నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు.టీం అంతా కలసి హ్యాపీ గా ఎంజాయ్ చేస్తూనే సినిమాను పూర్తి చేశాము అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ హర్విజ్ మాట్లాడుతూ. ” ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ “. Abg లో డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఐదు ఉంటాయి. ఈ పాటలు అందరికి బాగా కనెక్ట్ అవుతాయి. ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
“బటర్ ఫ్లై” మూవీ డైరెక్టర్ సతీష్ గంట మాట్లాడుతూ.. ఎప్పటి నుండో సినిమా తియ్యాలి అనుకున్న నన్ను ఈ బ్యానర్ డైరెక్టర్ ను చేసింది.. సమీర్ రెడ్డి గారు డి. ఓ. పి గా చేస్తున్నారు..డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు. బ్యూటిఫుల్ గర్ల్ సినిమా టీమ్ కు తన విషస్ చెప్పారు.
నటీ నటులు
నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు
సహ నిర్మాతలు : అనిల్, క్రాంతి జువ్వల
ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహన్ దాస్ సా
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి ప్రకాష్ బోడపాటి
డి. ఓ. పి : అమర్ దీప్
ఆర్ట్ : విజయ్ మక్కెన
మ్యూజిక్ డైరెక్టర్ : అర్వీజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : గిడియన్ కట్ట
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
కాస్ట్యూమ్స్ డిజైనర్: హర్షిత రావూరి