• December 16, 2021

Vishnupriya : ఓయో రూంలో ఎంజాయ్ చేశా.. గుట్టువిప్పిన యాంకర్ విష్ణుప్రియ

Vishnupriya : ఓయో రూంలో ఎంజాయ్ చేశా.. గుట్టువిప్పిన యాంకర్ విష్ణుప్రియ

    Anchor Vishnupriya నెట్టింట్లో ఓయో రూంలకు ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న యూత్‌కు ఓయో రూంలు అంటే ఎలాంటి అర్థాలు వస్తున్నాయో తెలిసిందే. అయితే అలాంటి ఓయో కోసం విష్ణుప్రియ ప్రకటనలు ఇస్తోంది. ఓయ్ రూంల యాడ్స్ కోసం విష్ణుప్రియ బాగానే నటిస్తోంది. ఇంతకు ముందే ఓయో రూంల గురించి విష్ణుప్రియ ఓ యాడ్ చేసింది. తాజాగా మరోసారి ఓయో రూం గురించి ప్రకటన చేసింది.

    మామూలుగా ఇలా సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తూ.. ప్రమోట్ చేస్తూ విష్ణుప్రియ బాగానే సంపాదించేస్తోంది. ఇక ఇన్ స్టా, యూట్యూబ్ వీడియోలతో తాను బాగానే సంపాదిస్తున్నానని విష్ణుప్రియే స్వయంగా చెప్పింది. ఒక్కో సారి కొన్ని ప్రొడక్ట్‌లకు లక్షల్లో ఆదాయం వస్తుందని కూడా సీక్రెట్ చెప్పేసింది విష్ణుప్రియ. అందుకే ఇలా ఓయో రూంలకు కూడా యాడ్ ఇస్తుందేమో.

    లాస్ట్ టైం ఓయో రూంలో ఉన్నప్పుడు ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. అందుకే మళ్లీ ఈ సారి ఓయో రూంలనే బుక్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నేను మళ్లీ నా పనులు మొదలుపెట్టి షెడ్యూల్ చేసుకునే ముందే నేను ఓయో రూంను బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓయో రూం ఎంతో బాగుంటుంది.. స్టాఫ్ అంతా కూడా డబుల్ వ్యాక్సినేషన్ వేసుకుని ఉంటారు.

    మనం వెళ్లగానే ఎంతో బాగా స్వాగతిస్తారు.. టెంపరేచర్ చెక్ చేస్తారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తారు.. రూంను ఎంతో శుభ్రంగా ఉంచుతారు.. అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఓయో రూంల ప్రకటనలతో విష్ణుప్రియ తెగ ఫేమస్ అవుతోంది. ఆఫర్లు కూడా ఉన్నాయని, OMOIND4 అనే కోడ్ వాడితే డిస్కౌంట్ ఆఫర్లు కూడావస్తాయని చెప్పుకొచ్చింది.

    Leave a Reply