- August 12, 2024
కూకట్ పల్లి నెక్సస్ మాల్ లో నెయిల్స్ N బియాండ్ షో రూమ్ ని ప్రారంభించిన యాంకర్ వర్షిణి
సెల్యూన్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరు గాంచిన నేచురల్స్ అనుబంధ బ్రాండ్ గా నెయిల్స్ N బియాండ్ ప్రారంభమైంది. మహిళలకు అందం విషయంలో స్కిన్, హెయిర్ ఎంత ముఖ్యమో చేతి గోళ్లు కూడా అంతే ముఖ్యం. నెయిల్ ఆర్ట్ విషయంలో మగువలు ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. అలాంటి వాళ్ళందరి కోసం నెయిల్స్ N బియాండ్ ఎన్నో రకాల వైవిధ్యమైన నెయిల్ ఆర్ట్ ఉత్పత్తులను, నెయిల్ ఆర్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ లో ఎంతో రద్దీగా ఉండే కూకట్ పల్లిలోని విశాలమైన నెక్సస్ మాల్ లో రెండో ఫ్లోర్ లో నెయిల్స్ N బియాండ్ షో రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ షో రూమ్ ను ప్రముఖ నటి, యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నెయిల్ ఆర్ట్ ను వేసుకుని మురిసిపోయారు. అమ్మాయిలందరి ఫేవరేట్ గా నెయిల్స్ N బియాండ్ నిలుస్తుందని వర్షిణి చెప్పారు. తాను ఓ సారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి చేతిలో ప్లకార్డ్ పట్టుకుని యాచిస్తూ ఉందని, కానీ ఆ అమ్మాయి చేతి వేళ్ళకు కూడా నెయిల్ ఆర్ట్ ఉండడం చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ షాప్స్ ప్రతి గల్లీలోనూ ఉన్నాయని, ఇది బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ అని వర్షిణి అభిప్రాయపడ్డారు. నెయిల్స్ N బియాండ్ త్వరలోనే మరో బ్రాంచ్ ని ప్రారంభించుకోవాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. నెయిల్స్ N బియాండ్ బాగా సక్సెస్ కావాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.