Anchor Ravi బిగ్ బాస్ ఇంట్లో యాంకర్ రవి చేస్తున్న పనులు ఎలా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. ఆట వరకు నిజంగానే గుంటనక్కలా ఆడుతున్నాడు. కానీ ఆట ముగిసినా కూడా ఎప్పుడూ ప్రతీ చోటా ఓ చెవి వేసి ఉంటాడు. అందరి దగ్గరకు వచ్చి అవసరం లేకపోయినా సలహాలు ఇస్తుంటాడు. వారి మైండ్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఏదో ఒకటి చెప్పి ప్రభావితం చేస్తుంటాడు. అలా యాంకర్ రవి ఇమేజ్ మాత్రం ఇప్పుడు దారుణంగా మారిపోయింది.
ఇక లోబో, యాంకర్ రవి ముందు నుంచి అనుకునే వచ్చారు అనే ఆరోపణ కూడా ఉంది. యాంకర్ రవికి లోబో సాయం చేసేందుకు వచ్చాడని అంటుంటారు. ముందు నుంచి వారిద్దరి మధ్య ఉన్న స్నేహంకూడా అలాంటిది. అయితే మొన్న శనివారం నాడు మాత్రం లోబో చేసిన పనికి రవి ఘోరంగా హర్ట్ అయినట్టున్నాడు. డూపు, తోపు అని చెప్పమంటే.. రవిని డూపు అనేశాడు. దీంతో అంందరూ ఆశ్చర్యపోయారు.
రవి మాత్రం దారుణమైన అవమానంగా ఫీలయ్యాడు. అలా లోబో మీద రవి గుర్రుగా ఉన్నాడు. తాను జీవితంలో ఇద్దరి కోసమే ఏడ్చాను అని ఒకటి తన పాప వియా కోసం అయితే.. రెండు మొన్న నువ్ బయటకు వెళ్లినప్పుడు ఏడ్చాను.. నువ్ చేసిన పనికి నాకు మనసు విరిగిపోయింది.. నేను అవసరానికే నీ దగ్గరికి వస్తానా? అని లోబో మీద తనకున్న కోపాన్ని అంతా కూడా రవి బయటపెట్టేశాడు. రవి, విశ్వ, లోబో పెట్టిన ఈ ముచ్చట్లు ఎంత వరకు వెళ్తాయో చూడాలి.