• January 7, 2022

ఇంకో దరిద్రం రెడీ అవుతోంది!.. అషూ పరువుతీసిన యాంకర్ రవి

ఇంకో దరిద్రం రెడీ అవుతోంది!.. అషూ పరువుతీసిన యాంకర్ రవి

    Ashu Reddy-Anchor Ravi అషూ రెడ్డి, యాంకర్ రవి ఇద్దరూ కలిసి హ్యాపీ డేస్ అనే షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. యాంకర్ రవి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో మధ్యలో ఈ షోను కొన్ని రోజులు ఆపేశారు. అయితే రవి లేకుండానే ఇంకొన్ని రోజులు ముందుకు తీసుకెళ్లారు. యూట్యూబర్ నిఖిల్‌తో కొన్ని రోజులు నడిపించారు. కానీ రవి చేసిన మ్యాజిక్‌ను మాత్రం క్రియేట్ చేయలేకపోయారు.

    అలా మొత్తానికి మళ్లీ యాంకర్ రవి హ్యాపీ డేస్ స్టేజ్ మీదకు ఎక్కేశాడు. అషూ రెడ్డితో కలిసి యాంకర్ రవి దుమ్ములేపుతున్నాడు. ఈ ఇద్దరూ ఆఫ్ స్క్రీన్‌లో ఎంత అల్లరి చేస్తూ సందడిగా ఉంటారో అందరికీ తెలిసిందే. బిహైండ్ కెమెరాలో ఈ ఇద్దరూ చేసే రీల్ వీడియోలు మామూలుగా వైరల్ అవ్వవు. ఆ మధ్య ఓ రీల్ వీడియో ఎంతగా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే.

    అడవి పంది అంటూ అషూ రెడ్డి నడిచి వచ్చిన వీడియోకు రవి యాడ్ చేసిన మ్యూజిక్ అందరికీ నవ్వులు తెప్పించింది. అయితే అషూ ఈ మధ్య పెడుతున్న వింత పోజుల గురించి అందరికీ తెలిసిందే. రకరకాల పోజులతో మీమర్స్‌కు తెగ పని దొరుకుతోంది. మొత్తానికి అషూ చేస్తోన్న ఫోటో షూట్లపై రవి దారుణమైన కామెంట్లు చేశాడు.

    పుష్పలో శ్రీవల్లిలా అషూ రెడ్డి పోజులు పెట్టింది. ఆ కూర్చోవడం ఏంటి? ఆ పోజులు ఏంటి?మీమ్స్ వస్తున్నాయి.. కనీసం ఆ డ్రెస్‌కైనా వాల్యూ ఇవ్వు.. ఇంకో దరిద్రం వస్తోందంటూ అషూ రెడ్డి పోజుల మీద రవి కామెంట్ చేశాడు. మీమ్స్ రావాలనే ఇలాంటి పోజులు పెడుతోందట అని కెమెరామెన్ కూడా చెప్పేశాడు.

    Leave a Reply