• October 19, 2021

Bigg Boss 5 Telugu : సన్నీని ఇరికించిన ప్రియ.. మధ్యలో బలైన రవి

Bigg Boss 5 Telugu : సన్నీని ఇరికించిన ప్రియ.. మధ్యలో బలైన రవి

    బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం నామినేషన్ రచ్చ రచ్చగా జరిగింది. వేటగాళ్లుగా సన్నీ, జెస్సీ, శ్రీరామచంద్రలను బిగ్ బాస్ నియమించాడు. వారి డేరాల్లో ఆ ముగ్గురు వేటగాళ్లుంటారు. ఇక మిగిలిన ఇంటి సభ్యుల సమయానుగుణంగా వచ్చే సైరన్ బట్టి.. లివింగ్ రూంలో ఉండే అరటిపళ్లను పట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఆ అరటి పళ్లను పట్టుకున్న వారికే నామినేషన్ చేసే అధికారం వస్తుంటుంది. అయితే ఆ వేటగాళ్లు తమ డేరాల్లోంచి ఎవరు ముందుగా బయటకు వస్తారో వారికే నామినేట్ చేసే చాన్స్ వస్తుంటుంది. అలా ఎక్కువ సార్లు బయటకు వచ్చే వేటగాడు బతికిపోతాడు. మిగిలిన ఇద్దరు వేటగాళ్లు నేరుగా నామినేట్ అవుతాడు.

    ఇలా మొత్తంగా టాస్కును వివరించాడు బిగ్ బాస్. అయితే సన్నీ మత్రం వేటగాడిలానే ఆడేశాడు. ప్రతీసారి సన్నీనే బయటకు వచ్చాడు. అయితే సిరి చాలా సార్లు అరటిపండును పట్టుకుంది. కానీ మానస్‌ను నామినేట్ చేస్తుండటంతో ఆ కారణాలను సన్నీ తీసుకోకుండా వేరే వాళ్లను నామినేట్ చేసేవాడు. అలా సిరి పదే పదే మానస్‌ను నామినేట్ చేస్తున్నానని చెప్పినా కూడా సన్నీ తీసుకోకపోవడంతో వేరే వాళ్లకు తన అరటిపండును సిరి ఇచ్చేసింది.

    అయితే సన్నీ ఆటను ఎలా ఎక్స్ పోజ్ చేస్తానో చూడు అన్నట్టుగా ప్రియ ఓ ప్లాన్ వేసింది. ప్రియ తన వంతు వచ్చినప్పుడు యాంకర్ రవిని నామినేట్ చేసింది. తన బెడ్డు మీద టవల్ ఆరేశాడంటూ సిల్లీ కారణం చెప్పింది. ఆ కారణంతో అయితే మాములూగా వేటగాడు.. యాంకర్ రవిని నామినేట్ చేయకూడదు. కానీ రవిని కచ్చితంగా చేస్తాడు అని తెలిసిన ప్రియ.. అలాంటి రీజన్ ఇచ్చి సన్నీని ఇరికించింది.

    శ్వేత విషయాన్ని బయటకు లాగుతూ రవిని సన్నీ నామినేట్ చేశాడు. దీంతో రవి, సన్నీల మధ్య మాటల యుద్దం పెరిగింది. ఇలా తగువు పెట్టేసిన ప్రియ మాత్రం నవ్వుతూ కూర్చుంది. ఇలా చేస్తావ్ అని నాకు తెలుసు.. అంటూ ప్రియ కౌంటర్లు వేసింది. నాతోనే ఆటలు ఆడతారా? అంటూ సన్నీ మరింత రెచ్చిపోయాడు. మొత్తానికి రవి మధ్యలో బక్రా అయ్యాడు. శ్వేతా గురించి నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ రవిని సన్నీ నామినేట్ చేశాడు.

    Leave a Reply