• November 11, 2021

యాంకర్ రష్మికి బంపర్ ఆఫర్!.. చిరంజీవి సినిమాలో స్పెషల్ రోల్

యాంకర్ రష్మికి బంపర్ ఆఫర్!.. చిరంజీవి సినిమాలో స్పెషల్ రోల్

    యాంకర్ రష్మీ ఇప్పుడు బుల్లితెర మీద తనకున్న క్రేజ్‌తోనే సరిపెట్టుకుంటుంది. ఒకప్పుడు వెండితెరపై వెలిగిపోవాలి, డబ్బులు సంపాదించుకోవాలనే కోరిక బాగానే ఉన్నట్టు కనిపించింది. అందుకే ఇష్టమొచ్చిన సినిమాలను చేసింది. అలా రష్మీ చేసిన ప్రతీ సినిమా బోల్తా కొట్టింది. అనవసరపు స్కిన్ షో చేయడంతో జనాలు రష్మిని ఛీ కొట్టారు. మొత్తానికి తన తప్పులు తెలుసుకుని రష్మీ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. మొత్తానికి కథ, పాత్రలు నచ్చితేనే ఒప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది

    అందుకే గీతా మాధురి భర్త నందు హీరోగా వస్తోన్న బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంతో రష్మీ మళ్లీ వెండితెర ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కనిపించింది. అయితే కరోనా వల్ల ఈ సినిమా ఎక్కడా చప్పుడు చేయడం లేదు. సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా రష్మికి బంపర్ ఆఫర్ వచ్చినట్టు కనిపిస్తింది. మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్‌లో భోళా శంకర్ అనే సినిమా రూపొందుతోందన్న సంగతి తెలిసిందే. నేను ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

    అయితే ఈ చిత్రంలో పని చేస్తున్న నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన లిస్ట్ విడుదల చేశారు. నటీనటుల పేర్లతో రష్మీ గౌతమ్ అనే పేరు కూడా ఉంది. శ్రీముఖి, గెటప్ శ్రీను వంటి వారికి కూడా అవకాశం వచ్చినట్టుంది. మొత్తానికి రష్మికి మాత్రం ఏకంగా మెగాస్టార్ సినిమాలోనే చాన్స్ వచ్చింది. అయితే ఇది చిరంజీవి కాంబినేషన్‌లో సీన్లు ఉండే పాత్రనా? లేదంటే సినిమాలో జస్ట్ ఒక పాత్రనా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి రష్మికి మాత్రం చిరు సినిమాలో ఆఫర్ వచ్చేసింది.

    Leave a Reply