• August 27, 2022

Anasuya ఆవేశం, ఆవేదన కూడా నిజమే కదా?

Anasuya ఆవేశం, ఆవేదన కూడా నిజమే కదా?

    Anasuya Bharadwaj అనసూయ కొన్ని సార్లు అతి చేసినట్టు అనిపిస్తుంది. కావాలనే వివాదాల్లోకి తల దూర్చినట్టు అనిపిస్తుంది. అయితే అనసూయను కూడా నెటిజన్లు మరీ ఇంతగా టార్చర్ పెట్టాల్సిన పని లేదు. ఇంత దారుణంగా ట్రోలింగ్ చేయాల్సిన పని లేదు. ఆంటీ అనేది బూతు పదం అనేది కాదు. ఈ విషయం అనసూయకు అంతగా అర్థం కావడం లేదో ఏమో తెలియడం లేదు. సరే ఆమెకు ఆంటీ అని పిలిస్తే నచ్చడం లేదు. జనాలు అయినా ఆమె నిర్ణయానికి గౌరవం ఇచ్చి వదిలేయొచ్చు కదా? అంటే అది కూడా జరగడం లేదు.

    అనసూయ ఎంత మొండిగా ఉందో.. ట్విట్టర్లో నెటిజన్లు కూడా అంతే మొండిగా ఉన్నారు. ఏది ఏమైనా కూడా.. పరుష పదాలు వాడటం, బూతులతో రెచ్చిపోవడం మాత్రం తప్పు. ఈ తప్పును అనసూయ చేయడం లేదు. ఎవరు ఎంతగా తిడుతున్నా.. బూతులతో రెచ్చిపోతోన్నా కూడా.. ఆమె మాత్రం గౌరవంగా, శాంతంగా అందరికీ రిప్లైలు ఇస్తోంది. ఈ విషయంలో మాత్రం అనసూయలో మార్పు కనిపిస్తోంది. అయితే ఈ వివాదానికి ముగింపు ఎప్పుడు వస్తుందనేది అర్థం కావడం లేదు.

    తనను అలా పిలిచి అవమానిస్తున్నారు.. తండ్రిని, భర్తని ఫ్యామిలీని లాగేస్తున్నారు.. తిడుతున్నారు.. ఇదంతా చూస్తూ కూర్చోవాలా? వీళ్లని ఇలానే వదిలేయాలా? అనేది అనసూయ వాదన. ఆమె వాదనలోనూ నిజం ఉంది.. ఆవేశం ఉంది ఆవేదన ఉంది. సోషల్ అబ్యూజింగ్, ఆన్ లైన్ అబ్యూజింగ్ అనేదాన్ని ఆపగలమా? ఆపే వీలుందా? ఎంత మందిని మనం కంట్రోల్ చేయగలం ఎలా చేయగలం? జైల్లో పెట్టాల్సి వస్తే ఎంత మందిని పెడతాం? అసలు వీటికి అంతం ఎప్పుడు? ఇవన్నీ భేతాల ప్రశ్నలే. లైగర్ సినిమాకు నెగెటివ్ టాక్ రావడం ఏంటి? అనసూయ దాని మీద పరోక్షంగా కౌంటర్లు వేయడం ఏంటి? ఈ ఆంటీ వివాదం తెరపైకి రావడం ఏంటో? ఇవన్నీ ఎప్పుడు సద్దుమణుగుతాయో చూడాలి.