• November 10, 2021

ఆ పని చేయక రెండు నెలలు అవుతోంది.. నోరు విప్పిన అనసూయ

ఆ పని చేయక రెండు నెలలు అవుతోంది.. నోరు విప్పిన అనసూయ

    యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఎంత ఫాలోయింగ్ ఉన్నా కూడా అంతే స్థాయిలో నెగెటివిటీ ఉంటుంది. ఎంత నెగెటివిటీ ఉన్నా కూడా వాటిని తట్టుకుని నిలబడుతుంది. ఇంతటి స్థాయికి చేరుకుంది. బుల్లితెర, వెండితెర అంటూ ఫుల్ స్పీడులో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేస్తోంది. తమిళ,కేరళ రాష్ట్రాల్లోనూ అనసూయ అడుగుపెట్టబోతోంది.

    అయితే తాజాగా అనసూయ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ప్రభుదేవా, రెజీనా కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్లాష్ బ్యాక్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రాబోతోంది. నిన్నే ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక పుష్పలో దాక్షాయణిగా అనసూయ పాత్రకు సంబంధించిరన ఫస్ట్ లుక్ విడుదల కానుంది. సినిమా సంగతులు అలా ఉంటే.. బుల్లితెరపై అనసూయ మరో లెవెల్. ఈ మధ్యే మాస్టర్ చెఫ్ అంటూ కొత్త షోలోకి వచ్చింది.

    తమన్నాను తీసేసి మరీ అనసూయను పెట్టుకున్నారు. అలా అనసూయ ఇప్పుడు వంటల ప్రోగ్రాంలోకి వచ్చింది. దీంతో ఓ నెటిజన్ ఆమెను వంటల గురించి ప్రశ్నలు సంధించారు. తాజాగా అనసూయ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఏమైనా అడగాలని ఉన్నా, తెలుసుకోవాలని ఉన్నా కూడా ప్రశ్నలు సంధించండి అని అడిగింది. దీంతో ఒక్కొక్కరు రెచ్చిపోయారు.

    తమకు నచ్చిన ప్రశ్నలు అడిగేశారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ మంచి రెసిపీ చేసి యూట్యూబ్‌లో వీడియో షేర్ చేయండి అని అడిగారు. పండగలకి తప్ప అససు ప్రాపర్‌గా వంట చేసి దాదాపు రెండు నెలలు అవుతోంది.. వంట చేయడం మిస్అవుతున్నాను. కచ్చితంగా ఓ వీడియో త్వరలోనే చేస్తాను.. మంచిగా వంట చేస్తాను అని చెప్పుకొచ్చింది.

    Leave a Reply